అమ్మవారికి సేవ చేయడం అదృష్టంగా భావిస్తున్నాం: ట్రస్టు డైరెక్టర్లు
ధన్‌పాల్ లక్ష్మీబాయి విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో పట్టు చీరల పంపిణీ…
ఇందూరు: దుర్గామాతకు సేవ చేయడం తమ అదృష్టంగా భావిస్తున్నామని ధన్‌పాల్ లక్ష్మీబాయి విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్టు డైరెక్టర్లు ఉదయ్ కుమార్, ప్రణయ్ కుమార్, డాక్టర్ వినయ్ కుమార్ పేర్కొన్నారు.
నిజామాబాద్ నగరంలోని మిర్చి కంపౌండ్‌లో ఉన్న డీఎస్ఎన్ కార్యాలయంలో ధన్‌పాల్ లక్ష్మీబాయి విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో అమ్మవారి మండపాల నిర్వాహకులకు పట్టు చీరలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ట్రస్టు డైరెక్టర్లు మాట్లాడుతూ.. ట్రస్టు ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా గత పదేళ్లుగా అమ్మవారి మండపాలకు పట్టు చీరలను పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు. ఇందూరు నియోజకవర్గ పరిధిలోని ప్రతి అమ్మవారి మండపానికి తమ వంతు సహకారంగా చీరలను అందజేస్తున్నామని వెల్లడించారు.
హిందూ పండుగల్లో అమ్మవారి నవరాత్రులకు విశేష ప్రాధాన్యత ఉందని, నిర్వాహకులు భక్తిశ్రద్ధలతో పాటు నియమ నిబంధనలను పాటిస్తూ నవరాత్రి ఉత్సవాలను నిర్వహించాలని సూచించారు. ప్రతి సంవత్సరం ఇందూరు నగరంలో అమ్మవారి మండపాల సంఖ్య పెరుగుతుండటం, యువత భక్తిమార్గంలో పయనించడం సంతోషకరమని అన్నారు. లోకమాత దుర్గాదేవి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి, 19వ డివిజన్ కార్పొరేటర్ నాగోళ్ల లక్ష్మీనారాయణ, కార్పొరేటర్లు మఠం పవన్, బంటు రాము, మల్కాయి మహేందర్, బంటు ప్రీతి ప్రవీణ్, ప్రసూన శ్రీనివాస్ రెడ్డి, జ్యోతి మురళి, ధాత్రిక పరమేశ్వర్, నాయకులు పవన్ ముందడ, మారావార్ కృష్ణ, శ్రీనివాస్, బాబీ సింగ్, మండల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

























