హసకొత్తూర్ గ్రామంలో పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు
– 16 మంది పట్టివేత, ఇద్దరు పరారీ, రెండు కేసులు నమోదు…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గుర్రం నరేష్
కమ్మర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని హసకొత్తూర్ గ్రామ శివారులో రాత్రి సమయంలో పేకాట ఆడుతున్నట్లు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు కమ్మర్పల్లి ఎస్సై సతీష్ ఆధ్వర్యంలో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పేకాట ఆడుతున్న 16 మందిని పోలీసులు పట్టుకున్నారు. మరో ఇద్దరు వ్యక్తులు అక్కడి నుంచి పరారయ్యారు.
ఈ సందర్భంగా పేకాట ఆడుతున్న వారి వద్ద నుంచి రూ.21,800 నగదు మరియు 15 మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి రెండు వేర్వేరు కేసులు నమోదు చేసి, పట్టుబడిన వారిపై చట్ట ప్రకారం తదుపరి చర్యలు చేపట్టారు.

























