ఎస్‌ఐఆర్ పేరుతో ఓట్ల తొలగింపునకు కుట్ర.. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీనామా చేయాలి
ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ధర్నా, నిరసన కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ కాంగ్రెస్ నేతలు…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్
ఢిల్లీ: ఎస్‌ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) పేరుతో ప్రజల ఓట్లను తొలగించేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపిస్తూ, కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ తన పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది.
ఏఐసీసీ ఆదేశాల మేరకు సోమవారం ఢిల్లీలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా, నిరసన కార్యక్రమంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి, నల్గొండ ఎంపీ రఘువీర్ రెడ్డి, నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాటిపల్లి నాగేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, సునీల్ రెడ్డి, వినయ్ రెడ్డి, ఏబీ చిన్న (శ్రీనివాస్) తదితరులు పాల్గొన్నారు.

























