డిచ్ పల్లి మండలం బర్దిపూర్ గ్రామం లో ఘనంగా బతుకమ్మ సంబరాలు…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్
నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం బర్దిపూర్ గ్రామం లో తెలంగాణ సంస్కృతి,సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకుని బర్దిపూర్ గ్రామంలో మహిళలు ఘనంగా సంబరాలు నిర్వహించారు.రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి,సంప్రదాయ దుస్తులు ధరించి పెద్ద సంఖ్యలో మహిళలు వేడుకల్లో పాల్గొన్నారు.బతుకమ్మ పాటలు పాడుతూ, ఆటపాటలతో సందడి చేశారు.తెలంగాణ సంస్కృతి,సంప్రదాయాలనుకాపాడుతూభావితరాలకు అందించాలనే సందేశాన్నిచాటిచెప్పారు.పూల పండుగైన బతుకమ్మ వేడుకలతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.ఈ కార్యక్రమం లో గ్రామ సర్పంచ్, కోట్ల.భాస్కర్ గ్రామ అభివృద్ధి కమిటీ.దాసు, అశోక్,విజయ్,అసాలమ్ రమేష్,శ్రీనివాస్ గంగుబాయి,ప్రభాకర్, సత్తయ్య పాల్గొన్నారు.























