ఈవీఎం గోడౌన్ ను సందర్శించిన కలెక్టర్…
జిల్లా కేంద్రంలోని వినాయకనగర్ లో గల ఈవీఎం గోడౌన్ ను శనివారం కలెక్టర్ ఇలా త్రిపాఠి అదనపు కలెక్టర్ రాజాగౌడ్ తో కలిసి సందర్శించారు. సాధారణ పరిశీలన ప్రక్రియలో భాగంగా క్షేత్రస్థాయి సందర్శన జరిపారు. ఈవీఎం గోడౌన్ కు వేసిన సీళ్లను పరిశీలించారు. ఈవీఎం గోడౌన్ వద్ద పోలీసు బందోబస్తు తీరును పరిశీలించారు. కలెక్టర్ వెంట ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు బాలరాజు, సిబ్బంది సాత్విక్, విజయేందర్ రెడ్డి, అగ్నిమాపక శాఖ అధికారి శంకర్ తదితరులు ఉన్నారు.























