రామడుగులో చైన్ స్నాచింగ్ కలకలం!
బస్‌స్టాండ్‌కు వెళ్తున్న మహిళ మెడలో నుంచి 3 తులాల బంగారు గొలుసు అపహరణ.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన ధర్పల్లి పోలీసులు…
త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
ధర్పల్లి : నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం రామడుగు గ్రామంలో చైన్ స్నాచింగ్ ఘటన కలకలం రేపింది. గుర్తుతెలియని వ్యక్తి ఓ మహిళ మెడలో నుంచి సుమారు 3 తులాల బంగారు గొలుసును బలవంతంగా లాక్కొని పరారయ్యాడు.
గ్రామానికి చెందిన గడ్డం పద్మ ఈరోజు ఉదయం తన ఇంటి నుంచి నిజామాబాద్ వెళ్లేందుకు బస్‌స్టాండ్‌కు నడుచుకుంటూ వెళ్తున్నారు. మార్గమధ్యంలో టీవీఎస్ మోటార్‌సైకిల్‌పై ఎదురుగా వచ్చిన గుర్తుతెలియని వ్యక్తి, ఎరుపు రంగు స్వెటర్ ధరించి, అకస్మాత్తుగా ఆమె మెడలోని బంగారు గొలుసును లాక్కొని అక్కడి నుంచి పరారయ్యాడు.
ఈ ఘటనపై బాధితురాలు ధర్పల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడిని గుర్తించి పట్టుకునేందుకు ప్రత్యేకంగా గాలింపు చర్యలు చేపట్టారు. పరిసర ప్రాంతాల్లో విచారణ జరుపుతూ నిందితుడి ఆచూకీ కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

























