Homeతెలంగాణగోదావరి–కృష్ణా నదుల అనుసంధానమే నల్గొండ నీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం!

గోదావరి–కృష్ణా నదుల అనుసంధానమే నల్గొండ నీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం!

గోదావరి–కృష్ణా నదుల అనుసంధానమే నల్గొండ నీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం!

ఏదుల నుంచి డిండికి నీళ్లు తీసుకురావడం అంత సులువు కాదు.. బస్వాపూర్ మీదుగా గోదావరి జలాలను తరలించడమే సరైన మార్గం

డిండి రిజర్వాయర్ వద్ద నీటిపారుదల ప్రాజెక్టులపై ప్రజెంటేషన్ ఇచ్చిన తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత…

డిండి, నల్గొండ : నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు, సాగునీటి సమస్యలను అధిగమించాలంటే గోదావరి–కృష్ణా నదుల అనుసంధానమే సరైన మార్గమని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత అభిప్రాయపడ్డారు. డిండి రిజర్వాయర్ వద్ద నీటిపారుదల ప్రాజెక్టుల పరిస్థితి, నీటి తరలింపు మార్గాలపై ఆమె ప్రజెంటేషన్ ఇచ్చారు.

ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. డిండి ఎత్తిపోతల పథకానికి ఏదుల నుంచి నీటిని తరలిస్తామంటూ ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, అది ఆచరణలో అంత సులభం కాదన్నారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకే శ్రీశైలం నుంచి రెండు టీఎంసీల నీటిని తీసుకునే పరిస్థితి లేదని పేర్కొన్నారు. ఎల్లూరు పంపుహౌస్ డిజైన్‌ను ఓపెన్‌కట్ విధానం నుంచి అండర్‌గ్రౌండ్ విధానానికి మార్చడం వల్ల నీటి తరలింపు సామర్థ్యంపై ప్రభావం పడిందని విమర్శించారు. ఈ మార్పులతో శ్రీశైలం నుంచి నీటిని తీసుకునే స్థాయి 800 అడుగుల నుంచి 820 అడుగులకు పెరిగిందని, అప్రోచ్ చానల్ పొడవు కూడా తగ్గిందని వివరించారు.

ఎల్లూరు పంపుహౌస్ నిర్మాణ సమయంలో చేపట్టిన బ్లాస్టింగ్ పనుల ప్రభావంతో కల్వకుర్తి పంపుహౌస్‌లో ఒక పంపు దెబ్బతిన్నదని, ఇప్పటికీ దాన్ని పూర్తిస్థాయిలో పునరుద్ధరించలేదని ఆరోపించారు. ఇలాంటి పరిస్థితుల్లో మరో పంపుహౌస్ నిర్మాణం చేపడితే కల్వకుర్తి, పాలమూరు ప్రాజెక్టులకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

డిండి ఎత్తిపోతలకు నీటిని అందించాలంటే ముందుగా స్పష్టమైన సోర్స్ పాయింట్ ఉండాలని, తగిన సర్వేలు, సాంకేతిక అధ్యయనాలు లేకుండా ఏదుల నుంచి నీటిని తీసుకొస్తామని ప్రకటించడం సరికాదన్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిది సార్లు సర్వేలు చేసినప్పటికీ స్పష్టమైన సోర్స్ పాయింట్‌ను ఖరారు చేయలేకపోయిందని గుర్తుచేశారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సరైన ప్రణాళిక లేకుండా మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల ప్రజల మధ్య నీటి వివాదాన్ని సృష్టిస్తోందని విమర్శించారు.

బస్వాపూర్ మీదుగా గోదావరి జలాల తరలింపే పరిష్కారం

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా సుమారు 80 శాతం పూర్తయిన బస్వాపూర్ రిజర్వాయర్‌ను పూర్తిచేసి, మల్లన్నసాగర్ నుంచి గోదావరి జలాలను తరలించడం ద్వారా డిండి ప్రాంతానికి నీటిని అందించవచ్చని కవిత ప్రతిపాదించారు. బస్వాపూర్ నుంచి ఉల్పర వరకు సుమారు 110 కిలోమీటర్ల మేర నీటిని తరలించే అవకాశాలను పరిశీలించాలని సూచించారు. అవసరమైతే కొండపోచంపల్లి నుంచి షామీర్‌పేట్ మీదుగా శివన్నగూడెంకు గోదావరి జలాలను తరలించే ప్రత్యామ్నాయ మార్గాన్ని కూడా పరిశీలించవచ్చన్నారు.

బస్వాపూర్ రిజర్వాయర్‌ను పూర్తిచేస్తే శివన్నగూడెంకు గ్రావిటీ ద్వారా నీటిని అందించే అవకాశం ఉంటుందని తెలిపారు. గోదావరి జలాలను వినియోగించకుండా డిండి ప్రాంతంలోని అదనంగా మూడున్నర లక్షల ఎకరాలకు సాగునీరు ఎలా అందిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలి

రాష్ట్రంలో ఇప్పటికే 80 శాతం పూర్తయిన ప్రాజెక్టులను పక్కనపెట్టి కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయడం వల్ల ప్రజలకు ప్రయోజనం ఉండదని కవిత విమర్శించారు. బస్వాపూర్, శివన్నగూడెం, కిష్టరాయపల్లి, ఎస్ఎల్‌బీసీ వంటి పెండింగ్ ప్రాజెక్టుల పనులను వేగవంతం చేయాలని కోరారు. మేడిగడ్డ వద్ద కన్నెపల్లి పంపుహౌస్‌ను వినియోగించుకునే అవకాశాలను కూడా ప్రభుత్వం పరిశీలించాలని సూచించారు.

తెలంగాణలో గోదావరి, కృష్ణా నదుల జలాలను పూర్తిస్థాయిలో వినియోగించుకునే ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. గోదావరి–కృష్ణా అనుసంధానంతో పాటు గోదావరి–కావేరి అనుసంధానంపై కూడా దృష్టి పెట్టాలని, గోదావరి–కావేరి అనుసంధానానికి తుపాకులగూడెం ప్రాంతాన్ని పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.

ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం కావాలి

నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్య పూర్తిగా తొలగాలంటే ఈ ప్రాంతానికి గోదావరి జలాలను తీసుకురావడంతో పాటు, అవసరమైన చోట్ల రిజర్వాయర్లు నిర్మించాలని కవిత అన్నారు. రెండు నెలల క్రితం మరో ఫ్లోరైడ్ కేసు నమోదైన నేపథ్యంలో ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు నిపుణులతో చర్చించి ప్రత్యామ్నాయాలను రూపొందించినట్లు తెలిపారు.

నాగార్జునసాగర్ పరిధిలోని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని, జిల్లాలో సాగునీటి వసతులను విస్తరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ప్రభుత్వంపై విమర్శలు.. బీఆర్ఎస్‌పైనా వ్యాఖ్యలు

గత బీఆర్ఎస్ ప్రభుత్వం పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేదని కవిత విమర్శించారు. గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాల్లో తాను కూడా భాగస్వామిగా ఉన్నందుకు క్షమాపణలు చెబుతున్నానన్నారు.

ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని ఆరోపించారు. ముఖ్యమంత్రి గతంలో రేసుగుర్రంలా ఉంటారని భావిస్తే, ఇప్పుడు కీలుగుర్రంలా మారిపోయారని వ్యాఖ్యానించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన బీఆర్ఎస్ పార్టీ నాన్ పెర్ఫార్మింగ్ అసెట్‌గా మిగిలిపోయిందని విమర్శించారు.

రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ, ప్రజా సమస్యలకు పరిష్కార మార్గాలను సూచిస్తున్నది తమ తెలంగాణ రక్షణ సేన మాత్రమేనని పేర్కొన్నారు.

రైతులకు ఎకరాకు రూ.25 వేల పరిహారం ఇవ్వాలి

రానున్న రోజుల్లో కరువు పరిస్థితులు తీవ్రంగా మారే ప్రమాదం ఉందని కవిత ఆందోళన వ్యక్తం చేశారు. పంటలు వేయవద్దని సూచిస్తున్న ప్రభుత్వం రైతులకు ఎలాంటి పరిహారం అందిస్తుందో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి ఎకరాకు రూ.25 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని కోరారు. రైతులకు సాగునీరు, యూరియా అందించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.

జిల్లాలో రహదారుల పరిస్థితి అధ్వాన్నంగా ఉందని, దేవరకొండ–డిండి రహదారి సమస్యను కూడా ప్రభుత్వం పరిష్కరించాలని సూచించారు. నీటిపారుదల, పౌరసరఫరాల శాఖల నిర్వహణపైనా విమర్శలు చేశారు.

రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేయడం, గోదావరి–కృష్ణా నదుల అనుసంధానం, నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్య నిర్మూలన, రైతులకు నష్టపరిహారం వంటి అంశాలపై తమ పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందని కవిత స్పష్టం చేశారు. తమ పార్టీ బృందం చిన్నదైనా ప్రజల కోసం నిరంతరం పనిచేస్తోందని తెలిపారు.

రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజా సమస్యలపై పోరాడుతున్న తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

ధర్పల్లి రేషన్ షాపుల్లో అధికారుల తనిఖీలు నిర్వహించారు…

0
ధర్పల్లి రేషన్ షాపుల్లో అధికారుల తనిఖీలు నిర్వహించారు... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాదు జిల్లా ధర్పల్లి మండలంలోని రేషన్ షాపులను శనివారం సివిల్ సప్లై అధికారి రవి తనిఖీ చేశారు....

పండుగల వేళ అప్రమత్తంగా ఉండాలి…

0
పండుగల వేళ అప్రమత్తంగా ఉండాలి.. రామారెడ్డి ఎస్సై మురళి సూచనలు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం రామారెడ్డి: మండల ప్రజలకు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపిన రామారెడ్డి ఎస్సై మురళి పలు భద్రతా సూచనలు చేశారు. పండుగల...

రేవంత్ రెడ్డి విమర్శలకు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కౌంటర్…

0
రేవంత్ రెడ్డి విమర్శలకు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కౌంటర్.. మరో రెండేళ్లలో నిన్ను, కాంగ్రెస్ పార్టీని పాతిపెట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు! తెలంగాణ ప్రజలు మళ్లీ ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని ఎదురుచూస్తున్నారు.. అసహనంతో...

మహిళా రైతుల కష్టాలు చూసి చలించిపోయిన కవిత.. కలెక్టర్‌తో మాట్లాడి విత్తనాలు పంపిణీ చేయించిన వైనం!

0
మహిళా రైతుల కష్టాలు చూసి చలించిపోయిన కవిత.. కలెక్టర్‌తో మాట్లాడి విత్తనాలు పంపిణీ చేయించిన వైనం! ఉదయం నుంచి వేరుశనగ విత్తనాల కోసం పడిగాపులు.. రైతుల ఇబ్బందులపై స్పందించిన తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు...

కాంగ్రెస్ ప్రజా పాలనలో బీసీలకు పెద్దపీట!

0
కాంగ్రెస్ ప్రజా పాలనలో బీసీలకు పెద్దపీట! జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు నాగరాజ్ గౌడ్... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ గడిల లింగం కామారెడ్డి :తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం 38 బీసీ కుల సంఘాల ఆత్మగౌరవ భవనాల...

Translate »
error: Content is protected !!