ధర్పల్లి రేషన్ షాపుల్లో అధికారుల తనిఖీలు నిర్వహించారు…
త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
నిజామాబాదు జిల్లా ధర్పల్లి మండలంలోని రేషన్ షాపులను శనివారం సివిల్ సప్లై అధికారి రవి తనిఖీ చేశారు. షాప్ నెంబర్ 4,లో మూడు నెలల బియ్యం స్టాకు, పంపిణీ, నిల్వలు, రిజిస్టర్లను పరిశీలించారు. డీలర్లు తమ గోడు వెళ్లబోసుకున్నారు. తక్కువ కమిషన్‌తో కుటుంబ పోషణ కష్టమని, MLS పాయింట్ నుంచి సరకుల సరఫరాలో ఇబ్బందులు, కొరతతో లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. సమస్యను పరిష్కరిస్తానని అధికారి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రేషన్ దారులు బాలే శంకర్ తదితరులు ఉన్నారు























