Homeతెలంగాణరేవంత్ రెడ్డి విమర్శలకు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కౌంటర్...

రేవంత్ రెడ్డి విమర్శలకు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కౌంటర్…

రేవంత్ రెడ్డి విమర్శలకు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కౌంటర్..

మరో రెండేళ్లలో నిన్ను, కాంగ్రెస్ పార్టీని పాతిపెట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు!

తెలంగాణ ప్రజలు మళ్లీ ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని ఎదురుచూస్తున్నారు..

అసహనంతో అబద్ధాలు, ప్రేలాపనలు చేయడమే రేవంత్ రెడ్డి ట్రేడ్‌మార్క్: వేముల ప్రశాంత్ రెడ్డి

అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నుంచి నీటిని పంపింగ్ చేయవచ్చని కేంద్ర సంస్థే చెప్పింది…

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన విమర్శలకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత వేముల ప్రశాంత్ రెడ్డి ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. మరో రెండేళ్లలో రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ పార్టీని పాతిపెట్టేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. రాబోయే ఎన్నికల కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని అన్నారు.

తన సొంత నియోజకవర్గంలో పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ చెప్పుకోవడానికి ఏమీ లేక ప్రతిపక్షాలపై నీచమైన వ్యాఖ్యలు చేశారని ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. మూడేళ్ల పాలనలో విఫల ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్న రేవంత్ రెడ్డిలో రోజురోజుకూ అసహనం పెరిగిపోతోందని, అందుకు ఆయన చేసిన తాజా వ్యాఖ్యలే నిదర్శనమని అన్నారు. అబద్ధాలు, అసహనంతో కూడిన ప్రేలాపనలే రేవంత్ రెడ్డి ట్రేడ్‌మార్క్‌గా మారాయని విమర్శించారు.

కొద్దిపాటి మరమ్మతులు చేపడితే కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీటిని సరఫరా చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ, కేవలం కేసీఆర్‌ను, బీఆర్ఎస్ పాలనను అప్రతిష్టపాలు చేయాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. అందుబాటులో ఉన్న నీటిని పంపింగ్ చేయకుండా పంటలను ఎండబెట్టిన చరిత్రహీనుడిగా రేవంత్ రెడ్డి మిగిలిపోవడం ఖాయమని వ్యాఖ్యానించారు.

అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు బాగానే ఉన్నాయని, వాటిలో నీటిని నిల్వ ఉంచి ఎత్తిపోసుకోవచ్చని సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ సంస్థ నివేదిక ఇచ్చినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకుండా రాజకీయ ప్రయోజనాల కోసం పక్కన పెట్టిందని ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు.

మరో రెండేళ్లలో రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా పాతాళానికి తొక్కేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. రైతులు, మహిళలు, నిరుద్యోగులు సహా రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు ప్రభుత్వ తీరుపై విసిగి వేసారిపోయారని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలు కళ్లు తెరిచి ప్రజల అభిప్రాయాలను గమనించాలని, వారి సమస్యలను వినాలని సూచించారు.

మూడేళ్ల పాలనలో చెప్పుకోవడానికి ఒక్క అభివృద్ధి పని కూడా లేకపోవడంతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవకాశం దొరికినప్పుడల్లా కేసీఆర్‌పై విమర్శలు చేస్తున్నారని అన్నారు. అబద్ధాలు, అసత్య ఆరోపణలతో పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధిని మరుగునపరచలేరని స్పష్టం చేశారు.

కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసేందుకు సహచర మంత్రితో కలిసి ప్రయత్నిస్తున్నారని, ఈ ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ.1,450 కోట్ల నుంచి ఏకంగా రూ.6,825 కోట్లకు పెంచారని రేవంత్ రెడ్డిపై ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. అలాంటి పరిస్థితుల్లో తమకు నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.

ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి గతంలో ఏం సాధించారని, ఇప్పుడు ఏం సాధిస్తారని ప్రశ్నించారు. ప్రతిపక్షాలు అసెంబ్లీలోకి వస్తే ప్రభుత్వ వైఫల్యాలు బయటపడతాయనే భయంతోనే వాటికి అవకాశం ఇవ్వకుండా, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ముఖ్యమంత్రిపై విమర్శలు గుప్పించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

ధర్పల్లి రేషన్ షాపుల్లో అధికారుల తనిఖీలు నిర్వహించారు…

0
ధర్పల్లి రేషన్ షాపుల్లో అధికారుల తనిఖీలు నిర్వహించారు... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాదు జిల్లా ధర్పల్లి మండలంలోని రేషన్ షాపులను శనివారం సివిల్ సప్లై అధికారి రవి తనిఖీ చేశారు....

పండుగల వేళ అప్రమత్తంగా ఉండాలి…

0
పండుగల వేళ అప్రమత్తంగా ఉండాలి.. రామారెడ్డి ఎస్సై మురళి సూచనలు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం రామారెడ్డి: మండల ప్రజలకు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపిన రామారెడ్డి ఎస్సై మురళి పలు భద్రతా సూచనలు చేశారు. పండుగల...

మహిళా రైతుల కష్టాలు చూసి చలించిపోయిన కవిత.. కలెక్టర్‌తో మాట్లాడి విత్తనాలు పంపిణీ చేయించిన వైనం!

0
మహిళా రైతుల కష్టాలు చూసి చలించిపోయిన కవిత.. కలెక్టర్‌తో మాట్లాడి విత్తనాలు పంపిణీ చేయించిన వైనం! ఉదయం నుంచి వేరుశనగ విత్తనాల కోసం పడిగాపులు.. రైతుల ఇబ్బందులపై స్పందించిన తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు...

కాంగ్రెస్ ప్రజా పాలనలో బీసీలకు పెద్దపీట!

0
కాంగ్రెస్ ప్రజా పాలనలో బీసీలకు పెద్దపీట! జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు నాగరాజ్ గౌడ్... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ గడిల లింగం కామారెడ్డి :తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం 38 బీసీ కుల సంఘాల ఆత్మగౌరవ భవనాల...

నిజామాబాద్‌పై బీజేపీ జాతీయ నాయకత్వం దృష్టి.. త్వరలో నితిన్ నబీన్ పర్యటనకు అవకాశం!

0
నిజామాబాద్‌పై బీజేపీ జాతీయ నాయకత్వం దృష్టి.. త్వరలో నితిన్ నబీన్ పర్యటనకు అవకాశం! త్వరలో నిజామాబాద్‌కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్.. ఎంపీ అర్వింద్ విజ్ఞప్తికి సానుకూల స్పందన... నిజామాబాద్, నవంబర్ 7: భారతీయ...

Translate »
error: Content is protected !!