పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమం విజయవంతం…
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా మూడవ రోజు బూతు వద్ద వేయించని చిన్నారుల కోసం ఏఎన్ఎంలు ఆశా కార్యకర్తలు నర్సింగ్ విద్యార్థినిలు ఎన్సిసి వాలంటీర్లు ఈరోజు ప్రతి ఇంటిని సందర్శించి బూతు వద్ద వేయించని ఐదు సంవత్సరాల లోపు చిన్నారులకు ఈరోజు పోలియో చుక్కలను పంపిణీ చేశారు. జిల్లాలో
*మొదటిరోజు* మొత్తం1,91,883 అర్హులైన చిన్నారులకు గాను 1,80,596 మంది చిన్నారులకు 94% చిన్నారులకు పోలియో చుక్కలు అందించడం జరిగింది.
*రెండవ రోజు*
మిగిలిన మొత్తం 11,282 మంది చిన్నారులకు గాను 9264 మంది చిన్నారులకు 99% ఇవ్వడం జరిగింది.
*మూడు రోజులు కలిపి* ఇప్పటివరకు మొత్తం లబ్ధిదారులు 1,91,883 కి గాను 1,92,470 అనగా 100.31% మంది చిన్నారులకు ఇవ్వడం జరిగింది . మూడవరోజు శత శాతం పూర్తి చేసి, ఈ కార్యక్రమాన్ని విజయ వంతం చేయడానికి సహకరించిన వైద్య సిబ్బంది,వివిధ శాఖల అధికారులు, స్థానిక నాయకులు, ఆశా కార్యకర్తలు,NCC, నర్సింగ్ విద్యార్థులకు ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని అభినందనలు తెలియజేశారు.

























