Homeకమ్మర్‌పల్లి మండల్ఆర్మూర్ ఎమ్మెల్యే వ్యాఖ్యలను ఖండించిన కాంగ్రెస్ నాయకులు...

ఆర్మూర్ ఎమ్మెల్యే వ్యాఖ్యలను ఖండించిన కాంగ్రెస్ నాయకులు…

ఆర్మూర్ ఎమ్మెల్యే వ్యాఖ్యలను ఖండించిన కాంగ్రెస్ నాయకులు

ఆదివారం : 05/07/26/త్రిశూల్ న్యూస్ కమ్మర్‌పల్లి మండల్ రిపోర్టర్ గుర్రం నరేష్

కమ్మర్‌పల్లి మండల కేంద్రంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో బాల్కొండ నియోజకవర్గ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆడెం గంగాప్రసాద్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బోనగిరి భాస్కర్, జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సుంకేట రవి, తిప్పిరెడ్డి శ్రీనివాస్, జిల్లా కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు పడిగల ప్రవీణ్ పాల్గొని మాట్లాడారు.

ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, బాల్కొండ మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ ఈరవత్రి అనిల్‌పై చేసిన వ్యాఖ్యలను వారు తీవ్రంగా ఖండించారు. ఈరవత్రి అనిల్ ఎన్నో సంవత్సరాలుగా రాజకీయాల్లో మచ్చలేని నాయకుడిగా కొనసాగుతున్నారని, అవినీతికి ఆమడ దూరంలో ఉంటూ బాల్కొండ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశారని పేర్కొన్నారు. ఆయనపై అసత్య ఆరోపణలు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిపై పలు ఆరోపణలు చేశారు. ఆయన గత చరిత్ర, ఎన్నికల హామీలు, ఆర్థిక వ్యవహారాలు, ప్రజా ప్రవర్తన తదితర అంశాలపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే ఎస్‌ఆర్‌ఎస్‌పీ బ్యాక్‌వాటర్ ప్రాంతంలో రైతులకు మట్టి సరఫరా విషయంలో ఎమ్మెల్యే జోక్యం చేసుకుని రైతులపై అదనపు భారం పడే పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు.

మతాన్ని రాజకీయ ప్రయోజనాలకు వినియోగిస్తూ సమాజంలో అశాంతిని సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారని, బలహీన వర్గాల నాయకులను లక్ష్యంగా చేసుకుని రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని, రానున్న ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు శిలేందర్, జగదీష్, బషీరాబాద్ దేవేందర్, సంజీవ్, చౌట్‌పల్లి రాజేందర్, బాలయ్య, ఉప్పులూరు అధ్యక్షుడు నరేష్, ఉపసర్పంచ్ శేఖర్, సుంకరి విజయ్, ఆంజనేయులు, సాదిక్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

మోరాడ్‌లో అర్ధరాత్రి ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ప్రతిష్ఠాపన…

0
మోరాడ్‌లో అర్ధరాత్రి ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ప్రతిష్ఠాపన త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కే నగేష్ నిజామాబాద్ జిల్లా మోరాడ్ మండల కేంద్రంలో జాతీయ రహదారి పక్కన ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని శనివారం అర్ధరాత్రి...

సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్…

0
సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు మహేష్...

ధర్పల్లిలో ఘనంగా విజయదశమి ఉత్సవం…

0
ధర్పల్లిలో ఘనంగా విజయదశమి ఉత్సవం త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని ధర్పల్లి సాయం శాఖ ఆధ్వర్యంలో విజయదశమి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శనివారం (అక్టోబర్...

నీటిని పొదుపుగా వినియోగిద్దాం.. ఎల్‌నినో ప్రభావాన్ని సమష్టిగా ఎదుర్కొందాం…

0
నీటిని పొదుపుగా వినియోగిద్దాం.. ఎల్‌నినో ప్రభావాన్ని సమష్టిగా ఎదుర్కొందాం నీటి సంరక్షణ మనందరి బాధ్యత: ఎఫ్‌ఆర్‌ఓ రవి మోహన్ బట్టు... త్రిశూల్ న్యూస్ ఇందల్వాయి మండల్ రిపోర్టర్ వైకుంఠం నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలంలో నీటిని పొదుపుగా...

రేణుక ఎల్లమ్మ ఆలయ వార్షికోత్సవంలో కాంగ్రెస్ నాయకులకు ఘన సన్మానం…

0
రేణుక ఎల్లమ్మ ఆలయ వార్షికోత్సవంలో కాంగ్రెస్ నాయకులకు ఘన సన్మానం... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలోని రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయం ఏడవ...

Translate »
error: Content is protected !!