2026–27 విద్యా సంవత్సరానికి ఇంటర్ మొదటి సంవత్సరం స్పాట్ అడ్మిషన్లు
ధర్మారం(బి) గురుకుల జూనియర్ కళాశాలలో జూలై 6న స్పాట్ కౌన్సిలింగ్
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్
నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం ధర్మారం(బి)లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలోని TGSWRS/JC (గర్ల్స్) జూనియర్ కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలోని వివిధ గ్రూపుల్లో మిగిలిన సీట్ల భర్తీ కోసం స్పాట్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ మాధవి లత తెలిపారు.
స్పాట్ కౌన్సిలింగ్ జూలై 6, 2026 (సోమవారం) ఉదయం 9:00 గంటలకు కళాశాల ప్రాంగణంలో ప్రారంభమవుతుంది. ఈ కౌన్సిలింగ్‌లో బాలురు, బాలికలు ఇద్దరూ పాల్గొనవచ్చు. ఆసక్తి గల విద్యార్థులు తమ అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఉదయం 9:00 గంటలకు హాజరు కావాలని సూచించారు.
ఉదయం 9:00 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 గంటల వరకు దరఖాస్తుల నమోదు (రిజిస్ట్రేషన్) జరుగుతుంది. అనంతరం మధ్యాహ్నం 2:00 గంటల తర్వాత మెరిట్ జాబితాను ప్రకటించి, వెంటనే కౌన్సిలింగ్ నిర్వహించి సీట్లను కేటాయిస్తారు.
అర్హతలు: తెలంగాణ రాష్ట్రంలో మార్చి–2026లో నిర్వహించిన ఎస్‌ఎస్‌సీ పరీక్షలో ఒకే ప్రయత్నంలో ఉత్తీర్ణులై ఉండాలి.
– విద్యార్థులు తమ ఉమ్మడి జిల్లా పరిధిలోని గురుకుల జూనియర్ కళాశాలలకే దరఖాస్తు చేసుకోవాలి.
– తెలుగు మీడియంలో 10వ తరగతి చదివిన విద్యార్థులు కూడా ఇంగ్లీష్ మీడియం కళాశాలలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
– కౌన్సిలింగ్‌కు హాజరయ్యే సమయంలో ఎస్‌ఎస్‌సీ మార్కుల మెమోతో పాటు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లు సమర్పించాలి.
– తల్లిదండ్రుల వార్షిక ఆదాయం:
– పట్టణ ప్రాంతం: రూ.2,00,000 లోపు
– గ్రామీణ ప్రాంతం: రూ.1,50,000 లోపు
– ఆదాయ ధృవీకరణ పత్రం 01-01-2026 లేదా ఆ తర్వాత జారీ చేయబడినది కావాలి.
– 31-08-2026 నాటికి విద్యార్థి వయస్సు 17 సంవత్సరాలు మించరాదు. ఎస్‌సీ విద్యార్థులకు గరిష్ట వయస్సులో ఒక సంవత్సరం సడలింపు ఉంటుంది.
అడ్మిషన్లు రిజర్వేషన్ నిబంధనలు మరియు 10వ తరగతిలో సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగా కేటాయించబడతాయని, అర్హత గల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ మాధవి లత కోరారు.

























