ధర్పల్లిలో ఎస్‌ఐఆర్ ప్రక్రియను పరిశీలించిన తహశీల్దార్…
త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
ధర్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో జరుగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) కార్యక్రమాన్ని ఆదివారం తహశీల్దార్ టి. శాంత పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అర్హులైన ప్రతి ఓటరు తప్పనిసరిగా నమోదు ఫారాలను భర్తీ చేసేలా బీఎల్‌వోలు (BLOలు), బీఎల్‌ఏలు (BLAలు) ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు.
నిర్దేశిత గడువులోగా అవసరమైన ఫారాలను సమర్పించని పక్షంలో ఓటు హక్కు కోల్పోయే అవకాశం ఉందని పేర్కొన్నారు. అందువల్ల అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని విజయవంతం చేయాలని ఆమె కోరారు.

























