గోనుగొప్పుల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు పాఠ్యపుస్తకాల పంపిణీ.
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్
నిజామాబాద్ జిల్లా గోనుగొప్పుల గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో సోమవారం ప్రీ-ప్రైమరీ విద్యార్థులకు లక్ష్మీ చేయూత సేవా సంస్థ, నిజామాబాద్ ఆధ్వర్యంలో పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా త్వరలోనే పాఠశాలకు జిరాక్స్ మిషన్‌ను కూడా అందజేస్తామని సంస్థ ప్రతినిధులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో లక్ష్మీ చేయూత సేవా సంస్థ సెక్రటరీ ఎస్. శ్రీనివాస్, క్యాషియర్ లక్ష్మణ్, సభ్యుడు టి. శ్యాం కుమార్ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను అందజేశారు.
కార్యక్రమంలో విద్యా శ్రేయోభిలాషి చరణ్ గౌడ్, గ్రామ సర్పంచ్, ఎస్.ఆర్. భూమేశ్వర్, బోజా గౌడ్, గట్టు భూమేష్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు అరుణ్ కుమార్, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు మరియు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గ్రామ పెద్దలు, పాఠశాల బృందం లక్ష్మీ చేయూత సేవా సంస్థ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, విద్యాభివృద్ధికి సంస్థ అందిస్తున్న సహకారం అభినందనీయమని పేర్కొన్నారు.

























