నులిపురుగుల నివారణ పై అవగాహన ర్యాలీ…
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహిస్తున్న “జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవo”కార్యక్రమాన్నీ పురస్కరించుకొని ఈరోజు నిజాంబాద్ నగరంలోని కోట గల్లి నందు గల శంకర్ భవన్ హై స్కూల్ వద్ద నుండి జాతీయ నులి పురుగుల నివారణపై అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ అవగాహన ర్యాలీని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ బి రాజశ్రీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ నిధి పురుగుల నిర్మూలనకు ఆల్బెండజోల్ మాత్రలు వాడండి,మనందరి పంతం నులిపురుగుల అంతం , పరిసరాల పరిశుభ్రత పాటించండి, రక్తహీనతను నివారించండి,లాంటి అవగాహన నినాదాలను కోట గల్లి రెసిడెన్షియల్ వీధుల గుండా చేస్తూ శంకర్ భవన్ స్కూల్ వద్దకు చేరుకుంది.ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ ప్రార్థన సమయంలో మాట్లాడుతూ జిల్లాలో ఒకటి నుండి 19 సంవత్సరాలలోపు విద్యార్థులందరికీ ఆల్బెండజోల్ మాత్రలు జులై 13 వ తేదీ రోజున జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా అందజేయడం జరుగుతుంది అని అన్నారు. విద్యార్థుల శారీరక మానసిక ఎదుగుదలకు ఆల్బెండజోల్ మాత్రం ఉపయోగపడుతుందనీ అన్నారు. ప్రధానంగా ఏ లిక పాములు
కొంకిపురుగులు, నులిపురుగులు, వల్ల విద్యార్థులలో రక్తహీనత, అలసట, కడుపులో నొప్పి, డయేరియా, డీసెంట్రీ, లక్షణాలు కనిపిస్తాయని అన్నారు. కాబట్టి ఒకటి నుండి 19 సంవత్సరాల వయసు విద్యార్థులందరూ ఆల్బెండజోల్ మాత్రను బాగా నమిలి చప్పరించాలన్నారు. భోజనానికి ముందు మల విసర్జన తర్వాత చేతులు శుభ్రత పాటించాలని చేతుల శుభ్రత పై అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా ఆశా కార్యకర్తలకు నులి పురుగుల నివారణ దినోత్సవం పై,వివిధ అంశాలపై పలు సూచనలు చేశారు. జిల్లాలో అర్హులైన మొత్తం ఒకటి నుండి 19 సంవత్సరాల విద్యార్థులు 390297 మంది ఉన్నారన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో డిఐఓ డాక్టర్ అశోక్, డిప్యూటీ డి ఎం హెచ్ ఓ డాక్టర్ సికందర్ నాయక్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు సాయన్న, డీఎస్ఓ గంగ కిషన్ , ప్రైమరీ ప్రధానోపాధ్యాయులు రామచందర్ గైక్వాడ్, ప్రోగ్రాం అధికారులు డాక్టర్ వెంకన్న, డాక్టర్ శిఖర, డాక్టర్ నవ్య, , వైద్యాధికారులు డాక్టర్ అజ్మతునిస, డాక్టర్ సుసేన, డాక్టర్ ప్రత్యూష, డాక్టర్ ప్రతాప్, డి హెచ్ ఈలు ఘన్పూర్ వెంకటేశ్వర్లు, మనోహర్, సచిన్, హెచ్ ఇ ఓ లు గోవర్ధన్, నాగరాజు,వెంకట్ రవి ,లింభారెడ్డి ,శంకర్, రవి చందర్, సి హెచ్ ఓ సంగుబాయి, డిపిఓ విశాల శ్యామల,శాంత కుమారి పర్యవేక్షణ అధికారులు ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, పాఠశాల విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

























