మాజీమంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి హౌస్ అరెస్ట్…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్
Jul 15, 2026,మాజీమంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి హౌస్ అరెస్ట్
తెలంగాణ : మాజీమంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. నిజామాబాద్ జిల్లా భీంగల్‌లో బుధవారం నిరాహార దీక్షకు ప్రశాంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. భీంగల్‌లో నిలిచిపోయిన అభివృద్ధి పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. దీంతో భీంగల్ వెళ్లకుండా ప్రశాంత్‌రెడ్డిని పోలీసులు గృహనిర్బంధం చేశారు. వేల్పూరులోని ఆయన నివాసం వద్ద పోలీసులు మోహరించారు.























