మాజీ కౌన్సిలర్ భర్త దారుణ హత్య…
ఆంధ్రప్రదేశ్ : కాకినాడ జిల్లా గొల్లప్రోలులో మాజీ కౌన్సిలర్ సంధ్య భర్త అర్జున్ దారుణ హత్యకు గురయ్యారు. అదే ప్రాంతానికి చెందిన బచ్చల కళ్యాణ్ లింగం అర్జున్‌పై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్రగాయాలపాలైన అర్జున్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.























