కూకట్‌పల్లిలో ట్రాఫిక్ మార్షల్స్‌కు అవగాహన కార్యక్రమం…
హైదరాబాద్, కూకట్‌పల్లిలో శుక్రవారం ట్రాఫిక్ మార్షల్స్‌కు అవగాహన మరియు సన్మాన కార్యక్రమం జరిగింది. డీసీపీ ట్రాఫిక్, ఏడీసీపీ ట్రాఫిక్, ఏసీపీ మాదాపూర్ ట్రాఫిక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మార్షల్స్‌కు క్రమశిక్షణ, సమయపాలన, వృత్తిపరమైన ప్రవర్తన, ప్రజలతో మర్యాదగా వ్యవహరించడం, ట్రాఫిక్‌ను సమర్థవంతంగా నియంత్రించడం, ట్రాఫిక్ పోలీసులతో సమన్వయంగా పనిచేయడం, భద్రతా నియమాలను పాటించడం, అనవసర వాదనలకు దూరంగా ఉండడం వంటి అంశాలపై సూచనలు చేశారు. ప్రజల భద్రతే లక్ష్యంగా బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని అధికారులు పిలుపునిచ్చారు.























