ధర్మవరం, పుట్టపర్తి మీదుగా బుల్లెట్ రైలు!
హైదరాబాద్–బెంగళూరు బుల్లెట్ రైలు కారిడార్ ఎలైన్‌మెంట్‌లో కీలక మార్పులు ప్రతిపాదించారు. ధర్మవరం, పుట్టపర్తి మీదుగా మార్గాన్ని మార్చాలని ఏపీ ప్రభుత్వం ఎన్‌హెచ్‌ఆర్‌సీఎల్‌కు సూచించింది. దీంతో ఈ రెండు ప్రాంతాల్లో హైస్పీడ్ రైల్వే స్టేషన్లు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. పుట్టపర్తికి దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులు, కియా పరిశ్రమ ఉద్యోగులు, రానున్న పరిశ్రమలకు ఇది ప్రయోజనకరంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. కొత్త ఎలైన్‌మెంట్‌తో అనంతపురం–హిందూపురం మధ్య దూరం 90.7 కి.మీ. నుంచి 102.1 కి.మీ.కు పెరిగినా, మరింత మందికి బుల్లెట్ రైలు సౌకర్యం అందుబాటులోకి రానుంది.




















