గోదావరి అందాలను కాపాడడం మన బాధ్యత- ఫారెస్ట్ అధికారి…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ మూన్ డిజైన్ శేఖర్
నందిపేట్ జూలై 18 త్రిశూల్ న్యూస్: నందిపేట, డొంకేశ్వర్ మండలాలలోని గోదావరి నదిపై కట్టిన శ్రీరామ్ సాగర్ రిజర్వాయర్ ముంపు ప్రాంతాల గ్రామాలలో ఆహ్లాదకరమైన వాతావరణం, చూడ చక్కని పచ్చని పచ్చిక బైళ్ళు, అందాల కృష్ణ జింకలు, ప్రపంచ చూపరులను ఆకట్టుకునే ఫ్లెమింగో పక్షులు రకరకాల వన్యప్రాణులకు నిలయమై నేడు వివిధ జిల్లాల నుండి వన్యప్రాణ ప్రేమికులను, ప్రకృతిని ఆస్వాదించే పర్యాటకులను ఈ ఎస్ ఆర్ ఎస్ పి బ్యాక్ వాటర్ ఎకో టూరిజం ఆకర్షిస్తుంది. వేసవికాలం పాఠశాలల సెలవు దినాలలో పర్యాటకుల రద్దీ విపరీతంగా పెరుగుతుంది. ఈ పర్యటకుల రద్దీ నీ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కూడా రెండు మండలాలలో గల గోదావరి తీరం వెంబడి గ్రామాలను రికో టూరిజం పేరుతో అభివృద్ధి చేసేందుకు, మంచి పర్యాటక ప్రాంతంగా మార్చాలని ప్రణాళికలు వేస్తున్నది. అయితే కానీ కొందరు పర్యాటకులు పర్యటనకు వచ్చిన సమయంలో ఎప్పుడు చూడని అందాల అడవి జంతువులను చూసిన ఆనందంలో జింకలను తరుముతున్నారని, అలాగే పర్యటనలో భాగంగా టూరిస్టులు ఆహార పదార్థాలు తెచ్చుకోవడం ఆహార పదార్థాల వ్యర్ధాలను ఎక్కడబడితే అక్కడ పడేయడం, మత్తు పానీయాలను సేవిస్తూ గ్లాసు బాటిల్లను పగలగొట్టడం వంటివి చేస్తున్నారని, ఆ ప్లాస్టిక్ వ్యర్ధాల వల్ల ప్రకృతి అందవికారంగా తయారవ్వడమే కాక, మూగజీవాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని, దయచేసి మన ప్రకృతిని పరిశుభ్రంగా ఉంచుకోవడం మన అందరి బాధ్యత అని అటవీశాఖ డిప్యూటీ రేంజ్ అధికారి సుధాకర్ టూరిస్టులకు విజ్ఞప్తి చేశారు. రెండు మండలాల ప్రజలు వచ్చే పర్యాటకులకు మంచి సహకారాన్ని అందిస్తారని ఆ ప్రజల స్వాగతాన్ని స్వీకరించి ప్రకృతిని కాపాడాలని విజ్ఞప్తి చేశారు.























