గోదావరిలో ఐదుగురి మృతిపై హోంమంత్రి అనిత దిగ్భ్రాంతి…
ఆంధ్రప్రదేశ్ : పోలవరం జిల్లా, గోదావరిలో ఐదుగురు మృతి చెందడంపై హోంమంత్రి అనిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్, ఎస్పీతో ఫోన్లో మాట్లాడిన హోంమంత్రి, ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని ఆదేశించారు. ఈ విషాద సంఘటనపై పూర్తి వివరాలు సేకరించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సూచించారు.























