ధర్పల్లి మండల సమగ్ర ప్రగతి ప్రణాళికపై సమీక్ష….
త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
ధర్పల్లి మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం మండల స్థాయి అధికారులు, గ్రామ కార్యదర్శులతో గ్రామపంచాయతీ సమగ్ర ప్రగతి ప్రణాళిక డేటా సేకరణ, ఆన్లైన్ అప్డేషన్పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ బి. మారుతి మాట్లాడుతూ గ్రామాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు సంబంధించిన వివరాలను క్షేత్రస్థాయిలో సేకరించి, నిర్ణీత గడువులోగా ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు. డేటాలో ఎలాంటి పొరపాట్లు లేకుండా నాణ్యతతో నమోదు చేయాలని, గ్రామాల సమగ్ర అభివృద్ధికి సమగ్ర ప్రగతి ప్రణాళిక ఉపయోగపడుతుందని తెలిపారు. సమావేశంలో ఎమ్మార్వో టీ శాంత ఎంపీవో శ్రీధర్తో పాటు మండల స్థాయి అధికారులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.






















