నీట్ పేపర్ లీక్ ఘటనపై ధర్పల్లిలో కాంగ్రెస్ నిరసన.. ప్రధాని మోదీ దిష్టిబొమ్మ దహనం…
త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
దేశవ్యాప్తంగా నీట్ (NEET) పరీక్ష పేపర్ లీక్ వ్యవహారంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో విద్యార్థులు నిర్వహించిన నిరసన కార్యక్రమంపై పోలీసుల చర్యలను ఖండిస్తూ, పార్లమెంట్ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు మద్దతుగా ధర్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం మండల కేంద్రంలో నిరసన చేపట్టారు.
ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహనం చేసి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులు, ప్రతిపక్ష నాయకులపై పోలీసులు చర్యలు తీసుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని కాంగ్రెస్ నాయకులు విమర్శించారు.
ఈ కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షులు ఆర్మూర్ చిన్న బాల్‌రాజ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాదె నరేష్‌తో పాటు మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

























