Homeతెలంగాణనందిపేటలో మార్మోగిన హరి కీర్తనలు...

నందిపేటలో మార్మోగిన హరి కీర్తనలు…

నందిపేటలో మార్మోగిన హరి కీర్తనలు…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ మూన్ డిజైన్ శేఖర్ 

నందిపేట్ జులై 23 త్రిశూల్ న్యూస్: నందిపేట మండల కేంద్రంలో బుధవారం కంటేశ్వర్ ఇస్కాన్ టెంపుల్ వారి ఆధ్వర్యంలో జరిగిన జగన్నాత రథయాత్ర అంగరంగ వైభవంగా సాగింది. మధ్యాహ్నం 2 గంటలకు స్థానిక వివేకనంద విగ్రహం వద్ద నుండి సాగిన రథయాత్ర చాకలి ఐలమ్మ, అంబేద్కర్, నంది విగ్రహల మీదుగా బస్టాండ్ మెయిన్ రోడ్డు నుండి పాతూర్ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ శివాజీ , మంతన గల్లి సుభాష్ చంద్రబోస్, గాంధీ విగ్రహాల వద్దనుండి నాగమంతెన సంగం ఫంక్షన్ హాల్ వరకు సాగింది. అనంతరం ఫంక్షన్ హాల్ లో ప్రభుజి ప్రవచనాలు విని ఇస్కాన్ వారు నిర్వహించిన అన్న ప్రసాదాలను భక్తులు స్వీకరించారు. రథయాత్రలో డప్పు వాయిద్యాల, తమ్మళ్ళ భాగజాలతో, ఇస్కాన్ సంగీత వాయిద్యాల నడుమ ఆధ్యాత్మిక నృత్యాలు చేస్తూ చిన్న పెద్ద తేడా లేకుండా, చిన్నపిల్లల నుండి పండు ముసలి వరకు హరే రామ హరే కృష్ణ.. రామ రామ హరే కృష్ణ అంటూ నినాదాలు చేస్తూ… పరవశించిపోయారు. ఎటు చూసినా జనం.. ప్రభంజనం.. ఎటు విన్న హరే కృష్ణ నినాదం.. ఎవరి నుదుట చూసినా గోపీచందన తిలకం ధరించి చూడముచ్చటగా కనిపించారు, విద్యార్థుల సాంస్కృతిక నాటికలు, నాట్యాలు రథయాత్రలో ప్రత్యేక ఆకర్షణ గా మారాయి. ఢిల్లీ బృందావనం నుండి వచ్చిన సంకీర్తన భక్తులు అలుపెరుగకుండా పాటలు పాడుతూ భక్తులను ఉర్రూతలూగించారు. ముఖ్య అతిథులుగా కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు కేదార్నంద రాములు మహారాజ్ , కంటేశ్వర్ ఇస్కాన్ రామానంద రాయ్ ప్రభుజీ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామానంద రాయ్ ప్రభుజి మాట్లాడుతూ…. నందిపేట మండల కేంద్రంలో ఈ జగన్నాథ రథయాత్రకు ఇంత పెద్ద ఎత్తున భక్తులు రావడ ఉందని, ప్రతి ఒక్కరూ హరి కీర్తనలు చేస్తూ, తన్మయంతో నాట్యమాడుతూ.. ఆ జగన్నాథ రథాన్ని తమ కరకములచే లగడం అదృష్టం గా భావించి ఐదు అడుగులైనా ఈ రథాన్ని లాగాలనే ఉద్దేశంతో ముందుకొచ్చి పాల్గొనడం నాకు చాలా సంతోషాన్ని కలిగించిందని, ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మిక చింతన తప్పనిసరి అని, ఒక మనిషి తనువు అలసట ఎలా తీర్చుకుంటాడో… అదే మనిషికి మానసిక ఆనందం కూడా ఎంతో అవసరమని ఆ మానసిక ఆనందం ఒక్క దైవచింతనతోనే సాధ్యమని… అది హరే రామ హరే కృష్ణ నినాదాలతో.. సంకీర్తనలు చేస్తేనే సిద్ధిస్తుందని తెలిపారు. ఇక్కడి ప్రజలందరికీ, కృష్ణ భక్తులకు, రథయాత్రకు సహకరించిన ప్రజా ప్రతినిధులకు, అధికారులకు అనధికారులకు, ముఖ్యంగా యువతకు, మహిళలకు, చిన్నపిల్లలకు సైతం పేరుపేరునా ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు అని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

వావిలాల పాఠశాలలో వనమహోత్సవం…

0
వావిలాల పాఠశాలలో వనమహోత్సవం... జనగామ జిల్లా పాలకుర్తి మండలం వావిలాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కలెక్టర్ ఆదేశాల మేరకు వనమహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించడం, విద్యార్థుల్లో మొక్కల సంరక్షణపై...

నిజామాబాద్ బస్టాండ్‌లో బస్సు ప్రమాదం.. మహిళ మృతి…

0
నిజామాబాద్ బస్టాండ్‌లో బస్సు ప్రమాదం.. మహిళ మృతి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... నిజామాబాద్ ప్రధాన ఆర్టీసీ బస్టాండ్‌లో బస్సు ప్రమాదం చోటుచేసుకుని ఓ వృద్ధ ప్రయాణికురాలు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. నిజామాబాద్ ప్రధాన...

యంగ్ ఇండియా పాఠశాలను జిల్లా కేంద్రంలోనే ఏర్పాటు చేయాలి…

0
యంగ్ ఇండియా పాఠశాలను జిల్లా కేంద్రంలోనే ఏర్పాటు చేయాలి... విద్యా సంస్థలను దూర ప్రాంతాల్లో ఏర్పాటు చేసి విద్యార్థులకు ఇబ్బందులను కలిగించవద్దు... టిఎన్ఎస్ఎఫ్,టిజెఎస్,టి ఎన్విఎస్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం... కామారెడ్డి నియోజకవర్గానికి కేటాయించిన యంగ్ ఇండియా...

జర్నలిస్టుల పాత అక్రిడిటేషన్ కార్డుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు!

0
జర్నలిస్టుల పాత అక్రిడిటేషన్ కార్డుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు! తెలంగాణలో జర్నలిస్టుల పాత అక్రిడిటేషన్ కార్డుల కాలపరిమితిని సెప్టెంబర్ 15 వరకు పొడిగిస్తూ రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. జర్నలిస్టుల...

ADF ద్వారా పేద కుటుంబాలకు అండగా ఎంపీ అర్వింద్ ధర్మపురి…

0
ADF ద్వారా పేద కుటుంబాలకు అండగా ఎంపీ అర్వింద్ ధర్మపురి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అర్వింద్ ధర్మపురి జన్మదినం సందర్భంగా ఆయన ఆధ్వర్యంలోని అర్వింద్ ధర్మపురి ఫౌండేషన్ (ADF)...

Translate »
error: Content is protected !!