భీంగల్‌లో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం చేసిన బీజేపీ నాయకులు…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్
భీంగల్: భీంగల్ పట్టణ బీజేపీ అధ్యక్షుడు కనికరం మధు ఆధ్వర్యంలో గురువారం పట్టణ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఈ సందర్భంగా కనికరం మధు మాట్లాడుతూ, ఢిల్లీలో ఇటీవల జరిగిన నిరసన కార్యక్రమాలపై బీజేపీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ఆప్ తదితర ప్రతిపక్ష పార్టీలపై విమర్శలు చేశారు. నీట్ పరీక్ష పేపర్ లీక్ అంశాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తూ కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. దేశ ప్రతిష్ఠను దెబ్బతీసే విధంగా వ్యవహరించారని విమర్శిస్తూ నిరసనగా రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేసినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు యోగేశ్వర్ నరసయ్య, పట్టణ ప్రధాన కార్యదర్శులు నవీన్, దయ ప్రవీణ్, పట్టణ ఉపాధ్యక్షుడు నవీన్, రైతు మోర్చా అధ్యక్షుడు నీలం గంగాధర్, తోట గంగాధర్, మండల ఉపాధ్యక్షుడు మహేందర్, సీనియర్ నాయకులు నాగార్జున రెడ్డి, బీజేవైఎం మండల అధ్యక్షుడు శెట్టి ప్రేమ్‌చంద్, బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు అజయ్, హరి ప్రసాద్, చిన్ని నరసయ్య, పఠాని ప్రవీణ్‌తో పాటు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






















