కోనసముందర్ ప్రభుత్వ పాఠశాలలో బాల సభ నిర్వహణ…
త్రిశూల్ న్యూస్ కమ్మర్పల్లి మండల్ రిపోర్టర్ గుర్రం నరేష్
నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలంలోని కోన సముందర్ గ్రామంలో గ్రామ సర్పంచ్ బెజ్జారం రాకేష్ అధ్యక్షతన గ్రామసభలో భాగంగా బాలసభను హై స్కూల్ , ప్రైమరీ పాఠశాలల విద్యార్థులతో కలిసి ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వర్షాకాలంలో తీసుకోవలసిన జాగ్రత్తలు మరియు వివిధ అంశాలపై అవగాహన కల్పించడంతో పాటు విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు .అలాగే ప్రతి విద్యార్థి ఒక్కొక్క మొక్క నాటి పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించాలని ,అందరూ ఆరోగ్యంగాఉండేందుకు తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించారు.విద్యార్థులు తమవంతుగా పారిశుధ్యంలో చెత్తా ను ట్రాక్టర్ లో వేయాలి, చెత్త ను సపరేట్ చేయడంలో సహకారమదించాలని కోరారు . ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ హెచ్ఎం లక్ష్మీనారాయణ, ఉప సర్పంచ్ సెక్రెటరీ, వార్డు మెంబర్లు, వైద్య సిబ్బంది ,గ్రామ కమిటీ అధ్యక్షులు, ఉపాధ్యాయుల బృందం పాల్గొన్నారు.






















