చెట్లు పెంచడం మనందరి బాధ్యత-సర్పంచ్ జీవన్ ..
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ మూన్ డిజైన్ శేఖర్
నందిపేట్ జులై 23 త్రిశూల్ న్యూస్: నందిపేట మండలం మాయాపూర్ గ్రామంలో సర్పంచ్ బ్యాగరి జీవన్ ఈత చెట్లను మాటించడం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ జీవన్ మాట్లాడుతూ…. నేటి సమాజంలో ప్రకృతిని ప్రతి ఒక్కరు కాపాడాల్సిందేనని, చెట్లు లేకపోతే మనిషి యొక్క మనుగడ ప్రశ్నార్థకమవుతుందని, ప్రతి ఒక్కరూ తమ విధిగా తమ వంతు ఒక చెట్టును నాటాలని, నేడు మనం ప్రకృతిని కాపాడితేనే భావితరాలకు కాలుష్యం లేని ప్రపంచాన్ని అందించిన వాళ్లమవుతామని, అందుకే హరితహారం లో భాగంగా ఈరోజు గ్రామంలోని పెద్ద చెరువు కట్టపై దాదాపు 1000 ఈత చెట్ల వనాన్ని పెంచాలని దృఢ సంకల్పంతో చెట్లను నటించడం జరిగిందని రెండు రోజుల్లో ఈ చెట్లని నటించడం జరుగుతుందని తెలిపారు. ఉప సర్పంచ్ విష్ణు, పంచాయతీ కార్యదర్శి వెంకటేష్,వార్డు మెంబర్ గంగాధర్, వి డి సి సభ్యులు గంగాధర్, మేటి లింగం, గొల్ల మహేష్, గొల్ల గంగమల్లు,గ్రామ యువకులు, ప్రజలు తదితల్లి కార్యక్రమంలో పాల్గొన్నారు.






















