ధర్పల్లిలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం చేసిన బీజేపీ నాయకులు…
త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
ధర్పల్లి, జూలై 23 : ధర్పల్లి మండల కేంద్రంలో గురువారం బీజేపీ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు.
దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోందని, రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు దేశ ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని బీజేపీ నాయకులు ఆరోపించారు. ఇలాంటి బాధ్యతారాహిత్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ నిరసన కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ మాజీ మండల అధ్యక్షులు దాసు, సరిచంద్, దోర్నాల రాజశేఖర్, చిలుక నరేష్ పాటు పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

























