మద్దుల తండా ప్రాథమిక పాఠశాలను పరిశీలించిన ఎంపీడీవో మారుతి…
త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
ధర్పల్లి, జూలై 23 : ధర్పల్లి మండలంలోని మద్దుల తండా ప్రాథమిక పాఠశాలను గురువారం ఎంపీడీవో మారుతి ఆకస్మికంగా సందర్శించి పరిశీలించారు. పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న మౌలిక సదుపాయాలు, విద్యా పరిస్థితులను పరిశీలించి ఉపాధ్యాయులతో మాట్లాడారు.
ఈ సందర్భంగా పాఠశాలలో మరుగుదొడ్ల సమస్యను గ్రామ సర్పంచ్ ఎంపీడీవో దృష్టికి తీసుకెళ్లారు. సమస్యపై వెంటనే స్పందించిన ఎంపీడీవో మారుతి, సంబంధిత అధికారులతో చర్చించి త్వరితగతిన పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
అనంతరం విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, పాఠశాల నిర్వహణ, హాజరు తదితర అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు మెరుగైన వాతావరణంలో విద్య అందేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామ సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు.

























