కేంద్ర విద్యాశాఖ తాత్కాలిక మంత్రిగా ప్రహ్లాద్ జోషి!
కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో.. ఆ బాధ్యతలను కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి ప్రభుత్వం అప్పగించింది. జోషికి ప్రస్తుతం ఉన్న వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ శాఖలతో పాటు విద్యాశాఖను అదనపు బాధ్యతగా అప్పగించారు. కాగా, మరోవైపు కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ చేసిన రాజీనామాను భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు.























