రేపు లోక్‌సభ ముందుకు పేపర్ లీకేజీల నివారణ బిల్లు!
దేశవ్యాప్తంగా పబ్లిక్ పరీక్షల్లో జరుగుతున్న పేపర్ లీకేజీలు, అక్రమాలకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కఠిన చట్టాన్ని తీసుకురానుంది. యూపీఎస్సీ తదితర పరీక్షల వ్యవస్థలో పారదర్శకతను పెంచే లక్ష్యంతో ‘ది పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు-2026’ను తీసుకొచ్చింది. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ప్రతిపాదించిన ఈ బిల్లును సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి.























