ఎల్-నినో ఎఫెక్ట్.. డ్రిప్ ఇరిగేషన్‌పై సర్కార్ ఫోకస్…
తెలంగాణ : రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు, భూగర్భ జలాలు తగ్గడం, ఎల్-నినో ప్రభావం నేపథ్యంలో నీటి పొదుపు దిశగా వ్యవసాయాన్ని మళ్లించేందుకు ప్రభుత్వం డ్రిప్ ఇరిగేషన్ విస్తరణకు ప్రాధాన్యం ఇస్తోంది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి 2,38,750 ఎకరాల్లో డ్రిప్ ఇరిగేషన్ వ్యవస్థలు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే 65,446 ఎకరాలకు పరిపాలనా అనుమతులు జారీ చేయగా, 34,909 ఎకరాల్లో పనులు పూర్తయ్యాయి. చిన్న, సన్నకారు రైతులకు డ్రిప్ ఇరిగేషన్ ప్రయోజనాలపై అవగాహన కల్పించాలని ప్రభుత్వం సూచించింది.























