Homeత్రిశూల్ న్యూస్ధర్పల్లి ఏరియా ఆసుపత్రి నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయించాలి  కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశం

ధర్పల్లి ఏరియా ఆసుపత్రి నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయించాలి  కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశం

ధర్పల్లి ఏరియా ఆసుపత్రి నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయించాలి

 కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశం

 క్షేత్రస్థాయిలో పనుల పురోగతి పరిశీలన

నిజామాబాద్, ఏప్రిల్ 08 : ధర్పల్లి మండల కేంద్రంలో నూతనంగా నెలకొల్పుతున్న ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి నిర్మాణ పనులను వేగవంతంగా చేపట్టి పూర్తి చేయించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. ధర్పల్లిలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను ౩౦ పడకల స్థాయి నుండి 100 పడకలకు పెంచుతూ ఏరియా ఆసుపత్రిగా ప్రభుత్వం అప్ గ్రేడ్ చేసింది. అన్ని వసతులతో నూతన భవన నిర్మాణం కోసం రూ. 33.15 కోట్ల రూపాయలను వెచ్చిస్తున్నారు. ఈ నేపధ్యంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం ధర్పల్లి ఏరియా ఆసుపత్రి నిర్మాణ పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇప్పటివరకు పూర్తయిన పనుల నాణ్యతను పరిశీలించి, ఇంకనూ చేపట్టాల్సి ఉన్న పెండింగ్ పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. పనులు మందకొడిగా కొనసాగుతుండడం పట్ల కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. ఎంతమంది కార్మికులు రోజువారీగా పనుల్లో పాల్గొంటున్నారని ఆరా తీశారు. పనులను వేగంగా జరిపించాలని, వచ్చే సెప్టెంబర్ నెలాఖరు నాటికి పూర్తి చేయించాలని గడువు విధించారు. వర్షాకాలం సీజన్ ప్రారంభం అయితే పనులకు ఆటంకం కలిగే అవకాశాలు ఉన్నందున యుద్ధప్రతపదికన పనులు జరిగేలా నిరంతర పర్యవేక్షణ జరపాలని అన్నారు. భవన నిర్మాణం పూర్తి చేయడంతో పాటు ఆసుపత్రికి అవసరమైన అన్ని వైద్య పరికరాలు, మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిర్మాణ పనులలో నిర్లక్ష్య వైఖరిని విడనాడాలని, పనితీరులో మార్పు కనిపించకపోతే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. ప్రజారోగ్యంతో కూడుకుని ఉన్నందున ఏరియా ఆసుపత్రి నిర్మాణం పనులను వేగవంతంగా జరిపించాలని, అదే సమయంలో నాణ్యతతో పనులు జరిగేలా పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. ఇసుక కొరత వంటి సాకులు చెప్పవద్దని, టీజీఎండీసీ ద్వారా అనుమతులు తీసుకుని నిర్మాణాలకు సరిపడా ఇసుక నిల్వలను సమకూర్చుకోవాలని సూచించారు. ఉదయం వేళలోనే ఇసుక రవాణా జరిగేలా చర్యలు తీసుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ రాత్రి సమయాలలో ఇసుక వాహనాలు తిరుగకూడదని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రధాన రహదారి నుండి ఏరియా ఆసుపత్రి వరకు అప్రోచ్ రోడ్డును సైతం నిర్మించాలని సూచించారు. కలెక్టర్ వెంట స్థానిక తహసిల్దార్ శాంత, టీజీఎంఐడీసీ ఏ.ఈ ప్రవీణ్ తదితరులు ఉన్నారు. 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

వావిలాల పాఠశాలలో వనమహోత్సవం…

0
వావిలాల పాఠశాలలో వనమహోత్సవం... జనగామ జిల్లా పాలకుర్తి మండలం వావిలాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కలెక్టర్ ఆదేశాల మేరకు వనమహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించడం, విద్యార్థుల్లో మొక్కల సంరక్షణపై...

నిజామాబాద్ బస్టాండ్‌లో బస్సు ప్రమాదం.. మహిళ మృతి…

0
నిజామాబాద్ బస్టాండ్‌లో బస్సు ప్రమాదం.. మహిళ మృతి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... నిజామాబాద్ ప్రధాన ఆర్టీసీ బస్టాండ్‌లో బస్సు ప్రమాదం చోటుచేసుకుని ఓ వృద్ధ ప్రయాణికురాలు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. నిజామాబాద్ ప్రధాన...

యంగ్ ఇండియా పాఠశాలను జిల్లా కేంద్రంలోనే ఏర్పాటు చేయాలి…

0
యంగ్ ఇండియా పాఠశాలను జిల్లా కేంద్రంలోనే ఏర్పాటు చేయాలి... విద్యా సంస్థలను దూర ప్రాంతాల్లో ఏర్పాటు చేసి విద్యార్థులకు ఇబ్బందులను కలిగించవద్దు... టిఎన్ఎస్ఎఫ్,టిజెఎస్,టి ఎన్విఎస్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం... కామారెడ్డి నియోజకవర్గానికి కేటాయించిన యంగ్ ఇండియా...

జర్నలిస్టుల పాత అక్రిడిటేషన్ కార్డుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు!

0
జర్నలిస్టుల పాత అక్రిడిటేషన్ కార్డుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు! తెలంగాణలో జర్నలిస్టుల పాత అక్రిడిటేషన్ కార్డుల కాలపరిమితిని సెప్టెంబర్ 15 వరకు పొడిగిస్తూ రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. జర్నలిస్టుల...

ADF ద్వారా పేద కుటుంబాలకు అండగా ఎంపీ అర్వింద్ ధర్మపురి…

0
ADF ద్వారా పేద కుటుంబాలకు అండగా ఎంపీ అర్వింద్ ధర్మపురి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అర్వింద్ ధర్మపురి జన్మదినం సందర్భంగా ఆయన ఆధ్వర్యంలోని అర్వింద్ ధర్మపురి ఫౌండేషన్ (ADF)...

Translate »
error: Content is protected !!