ప్రశ్నించే గొంతులపై నిర్బంధమా?
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్…
విద్యార్థి సంఘాల నాయకులపై బనాయించిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలి.NSUI, SFI, AISF, PDSU,PDSU, AIPSU, AISB విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్‌లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో విద్యార్థి సంఘాల బంద్ పిలుపులో పాల్గొన్న నాయకులపై నమోదు చేసిన అక్రమ కేసులను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని, ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్న చర్యలను నిలిపివేయాలని ఏకగ్రీవంగా డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు,ప్రజాసంఘాల ప్రతినిధులు, విద్యార్థి సంఘాలు,యువజన, కార్మిక,దళిత,మహిళా, ఉపాధ్యాయ సంఘాల నాయకులు,మేధావులు, ప్రజాస్వామ్యవాదులు పాల్గొనితమఅభిప్రాయాలనువెల్లడించారు.ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతులను కేసులతో అణచివేయడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకర సంకేతమని, విద్యార్థి ఉద్యమాల పట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని తీవ్రంగా ఖండించారు.ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి రఘురాం అధ్యక్షత వయించగా,ఈ సందర్భంగాసిపిఐ జిల్లా కార్యదర్శి. సుధాకర్,సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు, సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ (ప్రజా పంథా) జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ, న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు వేల్పూర్. భూమన్నలుమాట్లాడుతూ,నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు ఇచ్చిన బంద్ పిలుపులో భాగంగా నిజామాబాద్ జిల్లాలో శాంతియుతంగా బంద్ నిర్వహించామని తెలిపారు. ఈ సందర్భంగా నగరంలోని రేయాన్స్ హోటల్ మేనేజ్‌మెంట్ కళాశాల వద్ద జరిగిన స్వల్ప ఘటనను సాకుగా చూపి విద్యార్థి సంఘాల నాయకులపై తప్పుడు కేసులు నమోదు చేయడం దుర్మార్గమని అన్నారు.విద్యార్థి నాయకులు యాజమాన్యం వ్యవహరించిన తీరుపై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ,ఆ ఫిర్యాదును పక్కనపెట్టి యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మాత్రమే కేసులు నమోదు చేయడం పోలీసుల ఏకపక్ష వైఖరికి నిదర్శనమని విమర్శించారు.ప్రజాస్వామ్య దేశంలో ప్రశ్నించే గొంతులను కేసులతో భయపెట్టే ప్రయత్నాలు రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటనా స్వేచ్ఛను హరించే చర్యలని పేర్కొన్నారు.దేశవ్యాప్తంగా నీట్ ఉద్యమాల్లో పాల్గొన్న విద్యార్థులపై నమోదైన కేసులను ఎత్తివేయాలనే నిర్ణయాలు తీసుకుంటున్న సమయంలో,నిజామాబాద్ జిల్లాలో మాత్రం విద్యార్థి నాయకులపై అక్రమ కేసులు నమోదు చేయడం ఆందోళనకరమన్నారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం,ఉద్యమాలను అణచివేయడానికి పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించడం తగదని అన్నారు.పీసీసీ రాష్ట్ర అధ్యక్షులు.మహేష్ కుమార్ గౌడ్,ప్రభుత్వసలహాదారులు సుదర్శన్ రెడ్డి,షబ్బీర్ అలీ, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు వెంటనే జోక్యం చేసుకుని విద్యార్థి సంఘాల నాయకులపై నమోదు చేసిన అక్రమ కేసులను ఎత్తివేసేలా రాష్ట్ర ప్రభుత్వం,పోలీసు శాఖపై ఒత్తిడి తీసుకురావాలని సమావేశం విజ్ఞప్తి చేసింది.
అలాగే పోలీస్ కమిషనర్ నిష్పాక్షికంగా వ్యవహరించి కక్షపూరిత ధోరణిని విడనాడి,విద్యార్థి నాయకులపై నమోదు చేసిన అక్రమ కేసులను వెంటనేఉపసంహరించుకోవాలని కోరారు.ప్రభుత్వాల ప్రజావ్యతిరేకవిధానాలు,విద్యారంగంలో ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీ,విద్యా వ్యాపారీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్న విద్యార్థి ఉద్యమాలను కేసులతో అణచివేయాలని చూస్తే ప్రజాస్వామ్య శక్తులు మౌనంగా ఉండబోవని హెచ్చరించారు.అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయకపోతే అఖిలపక్షాలు,విద్యార్థి సంఘాలు,ప్రజాసంఘాలు, ఉపాధ్యాయ,కార్మిక, దళిత,మహిళా సంఘాల ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా విస్తృత ఆందోళనలు చేపడతామని స్పష్టం చేశారు.ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో డిటిఎఫ్ రాష్ట్రఉపాధ్యక్షులు.శాంతన్,రిటైర్డ్ పెన్షన్ అసోసియేషన్ రామ్మోహన్ రావు, జమాతే ఇస్లామిక్ హుస్సేన్, మహిళా సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు. అరుణ,సంధ్యారాణి, సిఐటియు జిల్లా నాయకులు నాగేశ్వరరావు, ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి సిర్పలింగం, ఎస్.జి. పద్మారావు,ఎన్ ఎస్ యు ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేణు రాజు, బివిఎం రాష్ట్ర అధ్యక్షులు బట్టు శ్రీధర్,ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షురాలు దీపిక, రాజు, పి డి ఎస్ యు జిల్లా అధ్యక్షులు.కర్క.గణేష్,గౌతం కుమార్,జిల్లా సహాయ కార్యదర్శి ప్రిన్స్ ఏఐఎస్ఎఫ్ నాయకులుకిషొర్,నిరాజ్,గణేష్,సాయి పవన్,రైతు సంఘం దేవేందర్ సింగ్,యువజన సంఘం జిల్లా అధ్యక్ష ఉపాధ్యక్షులు.సత్యం, సాయిబాబా,ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి రంజిత్, ఎన్ సాబ్ జిల్లా కార్యదర్శి అలీ, ఇఫ్టు జిల్లా అధ్యక్షులు.భూమన్న,ఆర్వైఎఫ్ సూర్యపాల్,బిఎస్ఎన్ఎల్ ఈవీఎల్ నారాయణ, డిహెచ్పిఎస్ రాజన్న, బిఎస్ఎన్ఎల్. శ్రీనివాస్, జన విజ్ఞాన వేదిక జిల్లా నాయకులు నర్సింలు, అమూల్య లతోపాటు విద్యార్థి,యువజన,మహిళ, ఉపాధ్యాయ,కార్మిక,కర్షక, మేధావి వర్గం నాయకులు పాల్గొన్నారు.

























