Homeత్రిశూల్ న్యూస్జన గణన విధులను పక్కాగా నిర్వహించాలి శిక్షణ తరగతుల్లో కలెక్టర్...

జన గణన విధులను పక్కాగా నిర్వహించాలి శిక్షణ తరగతుల్లో కలెక్టర్ ఇలా త్రిపాఠి ఉద్బోధ

నిజామాబాద్, మార్చి 11 : జన గణన విధులను పక్కాగా నిర్వహించాలని, అప్పుడే ఆయా వర్గాల ప్రజలకు భవిష్యత్తులో కల్పించాల్సిన మౌలిక సదుపాయాలు, అమలు చేయాల్సిన సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ఒక అవగాహనకు వచ్చి కార్యాచరణను అమలు చేసేందుకు ఆస్కారం ఉంటుందని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. సెన్సెస్ – 2027 ను పురస్కరించుకుని జనాభా లెక్కల సేకరణ ప్రక్రియలో భాగస్వాములు అయ్యే తహసిల్దార్లకు, సంబంధిత శాఖల అధికారులకు బుధవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో శిక్షణ తరగతులు ఏర్పాటు చేశారు. ఈ నెల 13వరకు మూడు రోజుల పాటు ఈ శిక్షణ కొనసాగనుండగా, హైదరాబాద్ నుండి వచ్చిన మాస్టర్ ట్రైనర్ అవగాహన కల్పిస్తున్నారు. జనాభా గణన కోసం ఎలా సన్నద్ధం కావాలి, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం తదితర అంశాల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కలెక్టర్ మాట్లాడుతూ, 2011 లో చివరిసారి జనాభా గణన జరిగిందని గుర్తు చేశారు. వాస్తవానికి 2021 లో ఈ ప్రక్రియను చేపట్టాల్సి ఉండగా, కరోనా తీవ్రత వల్ల నిర్వహించలేదని అన్నారు. ప్రస్తుతం సాంకేతికతను వినియోగిస్తూ, డిజిటల్ విధానంలో జనాభా లెక్కల సేకరణ జరిపేందుకు ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. తొలి దశలో నివాస గృహాలతో పాటు అన్ని రకాల కట్టడాలు, కుటుంబ వివరాలను సేకరించడం జరుగుతుందని, రెండవ విడతలో వ్యక్తిగత వివరాలు సేకరించాల్సి ఉంటుందన్నారు. దేశంలోనే తొలిసారి పూర్తిగా డిజిటల్ విధానం ద్వారా జన గణన జరపాల్సి ఉంటుందన్నారు. ఇప్పటికే గతేడాది నల్గొండ జిల్లా తిప్పర్తి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలాల్లో ప్రయోగాత్మకంగా కుటుంబ, ఇళ్ళ వివరాల సేకరణ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించారని కలెక్టర్ గుర్తు చేశారు. జన గణనలో ప్రతి ఒక్కరు భాగస్వాములై వాస్తవ వివరాలు వెల్లడించాలని సూచించారు. ఏ ఒక్కరి వివరాలు సైతం ఎక్కడ కూడా బయటికి వెల్లడి కావని, నేరుగా సర్వర్ లో నిక్షిప్తం అయ్యేలా సాంకేతికతను వినియోగిస్తున్నారని అన్నారు.ఈసారి సెల్ఫ్ డిక్లరేషన్ ఎంతో ముఖ్యమని, అధికారులు, ఎన్యుమరేటర్లు సమన్వయంతో పని చేయాలని సూచించారు. చార్జ్ ఆఫీసర్లు ప్రతిరోజూ జన గణన ప్రక్రియను సమీక్షించాలని, తాము కూడా రోజువారీగా పర్యవేక్షణ జరుపుతామని అన్నారు. అందుబాటులో ఉన్న సిబ్బందితో నిర్దేశిత గడువు లోపు జనాభా లెక్కల సేకరణ ప్రక్రియను మెరుగైన రీతిలో పూర్తి చేసేలా సన్నద్ధం చేయాలన్నారు. ప్రణాళికల రూపకల్పన, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల రూపకల్పనకు దోహదపడే జన గణన ప్రక్రియను నిబద్ధత, అంకితభావంతో నిర్వహించాలని కలెక్టర్ హితవు పలికారు. ఈ కార్యక్రమంలో బోధన్, ఆర్మూర్ సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిగ్యాన్ మాల్వియ, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

వినాయక చవితి, దుర్గామాత మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలి: ప్రజావాణిలో వి.హెచ్.పి., బజరంగ్ దళ్ వినతి

0
వినాయక చవితి, దుర్గామాత మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలి: ప్రజావాణిలో వి.హెచ్.పి., బజరంగ్ దళ్ వినతి... ఈ రోజు విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆర్మూర్ నగర శాఖ ఆధ్వర్యంలో వినాయక చవితి...

డిచ్ పల్లి మండలం ఘన్ పూర్ గ్రామం లో నూతన సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలి…

0
డిచ్ పల్లి మండలం ఘన్ పూర్ గ్రామం లో నూతన సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలంలోని ఘన్ పుర్ గ్రామంలో నూతన...

హత్యాయత్నం కేసులో నిందితుల అరెస్ట్ – రిమాండ్‌కు తరలింపు: కమ్మర్పల్లి SI, శ్రీ.CH.సతీష్…

0
హత్యాయత్నం కేసులో నిందితుల అరెస్ట్ – రిమాండ్‌కు తరలింపు: కమ్మర్పల్లి SI, శ్రీ.CH.సతీష్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గుర్రం నరేష్... పాత కక్షలతో గొడ్డలితో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన ఇద్దరు నిందితులను ఈరోజు అరెస్ట్...

డిచ్ పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు వెంటనే సొంత భవనం నిర్మించాలి…

0
డిచ్ పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు వెంటనే సొంత భవనం నిర్మించాలి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం లో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి స్పందించాలి...

యంగ్ ఇండియా పాఠశాలను కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలి…

0
యంగ్ ఇండియా పాఠశాలను కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలి... డిగ్రీ కళాశాల భూములలో ఏర్పాటు చేయాలి... టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బాలు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం... కామారెడ్డి నియోజకవర్గానికి కేటాయించిన యంగ్...

Translate »
error: Content is protected !!