ధర్పల్లి మండల పరిషత్ కార్యాలయంలో ఘనంగా జెండా ఆవిష్కరణ…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్…
నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల పరిషత్ కార్యాలయంలో శనివారం 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల ప్రత్యేక అధికారి శ్రీనివాస్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో మారుతి, ఎమ్మార్వో శాంత, ఎంపీఓ శ్రీధర్, డీసీసీ అధ్యక్షులు బాలరాజ్, ధర్పల్లి సర్పంచ్ చెలిమెల శ్రీనివాస్, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

























