స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్ కల్లూరి సంధ్య–హనుమాన్లు…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ఎ. గణేష్…
నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండలంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పోతంగల్ సర్పంచ్ కల్లూరి సంధ్య–హనుమాన్లు ఆధ్వర్యంలో గ్రామ ప్రజల సమక్షంలో జాతీయ జెండాను ఆవిష్కరించి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుల సేవలను స్మరించుకోవాలని, వారి ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అనంతరం గ్రామ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు, యువత, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

























