ధర్పల్లిలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్…
ధర్పల్లి: 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు 15న ధర్పల్లి హెడ్‌క్వార్టర్‌లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని జాతీయ జెండాకు వందనం చేశారు. దేశ స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన మహనీయులను స్మరించుకున్నారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు జీర్ర మహిపాల్‌తో పాటు కర్క గంగారెడ్డి, కోమటి దాసు, చిలక మహేష్, సరిచంద్, దోర్నాల రాజశేఖర్, కర్క బాల్రెడ్డి, అమృనాయక్, తాళ్ల రాము, తెడ్డు శంకర్, నల్ల పెంటన్న, నారాయణ, చిలుక నరేష్, మల్లయ్య యాదవ్, అచ్యుత్, బాచంపల్లి అశోక్, అచ్యుత్ రాజ్, బర్దరెడ్డి జ్ఞానేశ్వర్, ఇప్ప సురేష్, రెబ్బ మురళి, గచ్చకాయల గంగాధర్, కొమిర గంగాధర్, మహేష్, నితిన్, కన్నా, సునీల్, సిహెచ్. రాజేందర్, సిహెచ్. శ్రీను, రమణ, రవి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా దేశభక్తి, జాతీయ సమైక్యతను చాటుతూ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు.

























