ధర్పల్లి మండలంలో సర్దార్ పాపన్న గౌడ్ 374వ జయంతి వేడుకలు…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్…
నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలో సర్దార్ పాపన్న గౌడ్ 374వ జయంతి వేడుకలను గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్దార్ పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. స్వాతంత్ర్య పోరాటంలో సర్దార్ పాపన్న గౌడ్ కీలక పాత్ర పోషించారని, ఆయన ధైర్యసాహసాలు, పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో నిమ్మల ప్రవీణ్ గౌడ్, సాగర్ గౌడ్, నిమ్మల చిన్న గంగాధర్ గౌడ్, సురేందర్ గౌడ్, జలంధర్ గౌడ్, రమేష్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, సంతోష్ గౌడ్, మైలారం గంగాధర్ గౌడ్‌తో పాటు గౌడ సంఘ సభ్యులు పాల్గొన్నారు.

























