Homeతెలంగాణకాంగ్రెస్ వైఫల్యాలపై బీఆర్ఎస్ సమరభేరి.. నిజామాబాద్‌లో బిగాల గణేష్ భారీ బైక్ ర్యాలీ

కాంగ్రెస్ వైఫల్యాలపై బీఆర్ఎస్ సమరభేరి.. నిజామాబాద్‌లో బిగాల గణేష్ భారీ బైక్ ర్యాలీ

కాంగ్రెస్ వైఫల్యాలపై బీఆర్ఎస్ సమరభేరి: నిజామాబాద్‌లో మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ

 ఎన్నికల హామీలను విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వం: మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ ధ్వజం

 వెయ్యికి పైగా బైక్‌లతో బీఆర్ఎస్ శ్రేణుల భారీ ప్రదర్శన

 ప్రజా సమస్యలపై పోరాటం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిక

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత బిగాల గణేష్ తీవ్రస్థాయిలో విమర్శించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న ప్రజా పోరాటంలో భాగంగా శనివారం నిజామాబాద్ నగరంలో యువత, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో వెయ్యి మందికి పైగా యువకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు.

పాత కలెక్టర్ గ్రౌండ్ నుంచి ప్రారంభమైన ఈ బైక్ ర్యాలీ ఫూలాంగ్ ఎక్స్ రోడ్, వర్ని ఎక్స్ రోడ్, ఖిల్లా ఎక్స్ రోడ్, పవన్ టాకీస్ రోడ్, నెహ్రూ పార్క్, బస్ స్టాండ్ మీదుగా సాగి తిరిగి పాత కలెక్టర్ గ్రౌండ్ వద్ద ముగిసింది.

గణేష్ బిగాల మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు 6 గ్యారెంటీలు, 420 హామీలిచ్చి ప్రజలను తీవ్రంగా మోసం చేసిందని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలన అట్టర్ ప్లాప్‌గా మారిందని, ప్రజా సమస్యలు రోజురోజుకూ పెరుగుతున్నాయని విమర్శించారు.

ఏ ప్రభుత్వానికైనా సర్దుబాటు చేసుకునేందుకు కొంత సమయం ఇవ్వాలనే ఉద్దేశంతో కేసీఆర్ వేచి చూశారని, అయితే ప్రజా సమస్యలు తీవ్రమవుతుండటంతో పోరాట బాట పట్టక తప్పలేదన్నారు. మహిళలు, రైతులు, నిరుద్యోగుల తరఫున బీఆర్ఎస్ రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తోందని స్పష్టం చేశారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్, జాబ్ క్యాలెండర్, యూత్ డిక్లరేషన్ వంటి హామీల అమలులో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, నిరుద్యోగ యువతకు వెంటనే స్పష్టమైన భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు నేడు కాంగ్రెస్ పాలనతో పోల్చి చూస్తున్నారని, రానున్న రోజుల్లో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావడం, కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇచ్చిన మాట ప్రకారం 6 గ్యారెంటీలు, పెండింగ్ హామీలను వెంటనే అమలు చేయాలని, లేనిపక్షంలో ప్రజల పక్షాన పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో నిజామాబాద్ మాజీ మేయర్ దండు నీతు కిరణ్ శేఖర్, నగర అధ్యక్షుడు సిర్ప రాజు, మాజీ NUDA చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, సత్య ప్రకాష్, సుజిత్ సింగ్, నవీద్ ఇక్బాల్, జగత్ రెడ్డిలతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

హనుమాన్ చాలీసా పారాయణంతో మారుమోగిన ఆలయం…

0
హనుమాన్ చాలీసా పారాయణంతో మారుమోగిన ఆలయం... హిందూ వాహిని ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో సామూహిక పారాయణం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం... కామారెడ్డి: పట్టణంలోని గంజువర్తక సంఘం హనుమాన్ ఆలయంలో హిందూ వాహిని ఆధ్వర్యంలో సామూహిక హనుమాన్...

ధర్పల్లిలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు…

0
ధర్పల్లిలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్... నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శనివారం ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్...

నీటి భద్రతపై గ్రామ సభలో చర్చ…

0
నీటి భద్రతపై గ్రామ సభలో చర్చ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ జితేందర్ నిజామాబాద్ జిల్లా: ఇందల్వాయి, సెప్టెంబర్ 05: ఇందల్వాయి మండలంలోని గంగారం తండా గ్రామపంచాయతీ పరిధిలో నిర్వహించిన గ్రామ సభలో నీటి భద్రత, గ్రామీణ...

తెలంగాణ నీటి భవిష్యత్ కోసం ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తేవాలి: నవీన్ కుమార్…

0
తెలంగాణ నీటి హక్కులను హరిస్తున్నా సీఎం మౌనమెందుకు? *హక్కులు కాపాడాల్సిన ముఖ్యమంత్రే ఏపీకి వంత పాడటం దౌర్భాగ్యం* *కృష్ణా నీటి జలాల్లో తెలంగాణకు అన్యాయం జరగడంలో మొదటి ముద్దాయి బీఆర్ఎస్సే* *కృష్ణా నీటిని పూర్తి స్థాయిలో వాడుకునేందుకు...

యూత్ డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ అతిపెద్ద డ్రామా: జీవన్ రెడ్డి ఫైర్…

0
*యూత్ డిక్లరేషన్ డ్రామా, యువతరానికి కోమా*  -ఓట్ల కోసం సిగ్గూఎగ్గూ లేకుండా దిగజారిన కాంగ్రెస్,  -నిరుద్యోగులు, స్టూడెంట్స్ మనోభావాలతో బ్లేమ్ గేమ్   -అధికారంలోకి వచ్చాక యూత్ కడుపుకొట్టిన బూతుల రేవంత్  -కాంగ్రెస్ వెయ్యి రోజుల చీటింగ్ పై యువత...

Translate »
error: Content is protected !!