ధర్పల్లిలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్…
నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శనివారం ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ సేవలను స్మరించుకున్నారు. ఉపాధ్యాయుల సేవలను కొనియాడుతూ, ఒకరికొకరు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.
కార్యక్రమంలో ధర్పల్లి మండలంలోని జడ్పీహెచ్ఎస్, ప్రాథమిక పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినులు పాల్గొన్నారు.

























