హనుమాన్ చాలీసా పారాయణంతో మారుమోగిన ఆలయం…
హిందూ వాహిని ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో సామూహిక పారాయణం…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం…
కామారెడ్డి: పట్టణంలోని గంజువర్తక సంఘం హనుమాన్ ఆలయంలో హిందూ వాహిని ఆధ్వర్యంలో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.

హిందూ వాహిని కుటుంబ సభ్యులు కుటుంబ సమేతంగా హాజరై హనుమాన్ చాలీసా పారాయణంలో పాల్గొన్నారు. ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో హనుమంతుడికి ప్రత్యేక పూజలు, సింధూర పూజ తదితర కార్యక్రమాలను నిర్వహించారు.
హనుమాన్ నామస్మరణ, చాలీసా పారాయణంతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో మారుమోగింది. పట్టణంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
హిందూ వాహిని సభ్యులు సమన్వయంతో కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు. అర్చకులు, హిందూ వాహిని సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.

























