వెంకటేశ్వర ఆలయంవద్ద అన్నదానం కార్యక్రమం…
త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం లోని సితాయిపేట్ గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గుడి తాండ బంజారా సోదరులు, సోదరీమణుల ఆధ్వర్యంలో పవిత్రమైన తీజు వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మండలంలోని వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని, అనంతరం అన్న ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ కమిటీ సభ్యులు తాండ ప్రజలకు అభినందనలు తెలిపారు.

























