నీటి భద్రతపై గ్రామ సభలో చర్చ…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ జితేందర్
నిజామాబాద్ జిల్లా: ఇందల్వాయి, సెప్టెంబర్ 05: ఇందల్వాయి మండలంలోని గంగారం తండా గ్రామపంచాయతీ పరిధిలో నిర్వహించిన గ్రామ సభలో నీటి భద్రత, గ్రామీణ మౌలిక సదుపాయాలు, జీవనోపాధి, విపత్తుల నివారణ అంశాలపై చర్చించారు. ఎంపీడీవో శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో గ్రామ ప్రజలకు పలు అంశాలపై అవగాహన కల్పించారు.
వృథా నీటిని ఒడిసిపట్టాలి
నీటి భద్రతలో భాగంగా ఇంకుడు గుంతల ఏర్పాటు, బోరు మోటర్ల నుంచి వృథాగా వెళ్తున్న నీటిని వినియోగించుకోవడం, వర్షాకాలంలో వృథాగా వెళ్లే నీటిని సంరక్షించడం వంటి అంశాలను అధికారులు వివరించారు. నీటి వనరులను భవిష్యత్ తరాలకు అందేలా సంరక్షించాల్సిన అవసరాన్ని వివరించారు.
మౌలిక సదుపాయాలపై అవగాహన
గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి, జీవనోపాధి అవకాశాలు, ఉపాధి కల్పనకు సంబంధించిన అంశాలపై సభలో చర్చించారు. గ్రామ అభివృద్ధికి ప్రజల భాగస్వామ్యం అవసరమని ఎంపీడీవో శ్రీనివాస్ సూచించారు.
విపత్తుల నివారణకు ముందస్తు చర్యలు
విపత్తుల నివారణపై ప్రత్యేక దృష్టి సారించాలని, ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. గ్రామస్థులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సుధాకర్, గ్రామపంచాయతీ సర్పంచ్ జరుపుల సంగీత దిలీప్, ఉపసర్పంచ్ ధూమ నాయక్, గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు.

























