Homeతెలంగాణయూత్ డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ అతిపెద్ద డ్రామా: జీవన్ రెడ్డి ఫైర్...

యూత్ డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ అతిపెద్ద డ్రామా: జీవన్ రెడ్డి ఫైర్…

*యూత్ డిక్లరేషన్ డ్రామా, యువతరానికి కోమా* 

-ఓట్ల కోసం సిగ్గూఎగ్గూ లేకుండా దిగజారిన కాంగ్రెస్, 

-నిరుద్యోగులు, స్టూడెంట్స్ మనోభావాలతో బ్లేమ్ గేమ్ 

 -అధికారంలోకి వచ్చాక యూత్ కడుపుకొట్టిన బూతుల రేవంత్ 

-కాంగ్రెస్ వెయ్యి రోజుల చీటింగ్ పై యువత ఫైటింగ్ 

-కాంగ్రెస్ కొట్టిన దొంగ దెబ్బకు విద్యార్థులు, నిరుద్యోగు లు విలవిల

-జాబ్ కేలండర్ ఒక జాబ్ లెస్ కేలండర్ 

-తెలంగాణ ఖజానా సొమ్ము మిస్ వరల్డ్ బ్యూటీల కోసమే

-తెలంగాణ అమ్మాయిల స్కూటీల కోసం కాదు

-బాకీల ఊబిలో ఫీజు రీయింబర్స్ మెంట్, మరో ఎగవేతకు ఎక్స్పరిమెంట్ 

-10,000 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు 

-ఒక్క ఇంజనీరింగ్ విద్యార్థులకే 5వేల కోట్ల బకాయిలు 

 -పథకం రద్దుకు

 రేవంత్ రెడ్డి కుతంత్రం 

-పచ్చ కాంగ్రెస్ కుట్రకు దుఃఖిస్తున్న అచ్చ కాంగ్రెస్ నేత వైఎస్ఆర్ ఆత్మ

 -ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి వంచించిన కాంగ్రెస్ 

-హక్కుల సాధన కోసం నిరసనలు తెలుపుతున్న విద్యార్థులపై లాఠీ ఛార్జీలు

-సీఎం రేవంత్ చేసిన ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు ఏం “క్రిమినల్ వేస్ట్” వ్యాఖ్యలు కండ కావరానికి నిదర్శనం

-యువతకిచ్చిన హామీలను తుంగలో తొక్కిన సర్కారు పెద్దలే అసలైన క్రిమినల్ వేస్ట్ 

-విద్యార్థులకు ఇస్తామన్న 

 రూ. 5 లక్షల విద్యా భరోసా కార్డుల హామీ బుట్ట దాఖలు  

-ఉద్యోగ నియామకాల పై, విద్యార్ధుల భవితవ్యంపై కాంగ్రెస్ వి అన్నీ కోతలే

-కాంగ్రెస్‌ పాలనలో ఉద్యోగాల ‘కల్పన’ ఒక అభూత కల్పన 

-సీఎం రేవంత్ రెడ్డి ఆరువేలిచ్చి.. 60 వేల ఉద్యోగాలిచ్చినట్టు పోజులు కొడుతుండు 

-భట్టి అసెంబ్లీలో ప్రకటించిన జాబ్‌ క్యాలెండర్‌ గోడలకు వేలాడుతోంది

-జాబ్ కేలండర్ నెలవారీ పాలు, గ్యాస్, ఇతర ఇంటి లెక్కలు రాసుకునే జాబ్ లెస్ కేలండర్ గా మారింది

-ఉద్యోగాలిచ్చిన ఘనత కేసీఆర్‌ ది.. క్రెడిట్‌ చోరీ కాంగ్రెస్‌ది

-16 నెలల్లో 57 వేలకుపైగా ఉద్యోగాలను భర్తీచేసినట్టు ప్రభుత్వం చెప్తున్నది

-కానీ వీటిలో కాంగ్రెస్‌ సర్కారు కొత్తగా భర్తీచేసింది ఆరువేల ఉద్యోగాలే

-గ్రూప్‌-1, డీఎస్సీలు కూడా కేసీఆర్‌ హయాంలో విడుదలైనవే

-పాత వాటిని రద్దుచేసి, కొన్ని పోస్టులను కలిపి విడుదల చేసినవే

-13 ఏండ్ల తర్వాత జేఎల్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది కేసీఆర్‌ సర్కారే 

-అసెంబ్లీ ఎన్నికల ముందు నిరుద్యోగుల ఓట్ల కోసం కాంగ్రెస్‌ పార్టీ డ్రామా యూత్‌ డిక్లరేషన్‌

-వెయ్యి రోజుల్లో యూత్ డిక్లరేషన్ అమలుకు నోచుకోలేదు

-నిరుద్యోగులకు నెలకు రూ.4వేల చొప్పున ఇస్తామన్న నిరుద్యోగ భృతి మృతి 

-ఖాళీలున్నా నియామకాలు గుండుసున్నా.

-ఏడు జోన్లల్లో ఎంప్లాయిమెంట్‌ ఎక్సేంజీల ఏర్పాటు ఏమయింది

-జిల్లాల్లో స్కిల్‌ సెంటర్ల ఏర్పాటు కాగితాలకే పరిమితం

-యూత్‌ కమిషన్‌ ఏర్పాటు చేస్తామన్న మాటా నీటి మూట 

-నిప్పులు చెరిగిన బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి 

-కాంగ్రెస్ సర్కారు వెయ్యి రోజుల వైఫల్యం పై తిరగబడిన యువత

-కదం తొక్కిన నిరుద్యోగులు, విద్యార్థులు 

ఆందోళన తో దద్దరిల్లిన నందిపేట్ 

 *పోలీసుల ఓవరాక్షన్* 

-నిరుద్యోగులు, విద్యార్థులపై ఖాకీల జులుం 

బీఆర్ఎస్ ఆందోళనలో పాల్గొనకుండా గేట్లకు తాళాలు


ఆర్మూర్, సెప్టెంబర్ 5:-యూత్ డిక్లరేషన్ పేరుతో ఓట్ల కోసం కాంగ్రెస్ ఆడిన అతిపెద్ద డ్రామా అని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి నిప్పులు చెరిగారు. తీరా అధికారంలోకి వచ్చిన తరవాత సీఎం రేవంత్ రెడ్డి పొడిచిన వెన్నుపోటుకు తెలంగాణ రాష్ట్ర యువతరం కోమాలోకి పోయినంత పనైందని ఆయన ఆరోపించారు.

100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి..1000 రోజులవుతున్నా అమలు చేయకుండా ప్రజలను నట్టేట ముంచిన కాంగ్రెస్ 420 మోసాలపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ ఇచ్చిన పిలుపు మేరకు నందిపేట్ మండల కేంద్రంలో ఫీజు రీయంబర్స్మెంట్, జాబ్ క్యాలెండర్‌,యూత్ డిక్లరేషన్ కోసం శనివారం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా జరిగిన భారీ ర్యాలీనుద్దేశించి జీవన్ రెడ్డి మాట్లాడుతూ

బూతుల నేతగా దేశ వ్యాప్తంగా పేరు గడించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యూత్ ఆశలకు ఘోరీ కట్టి నిరుద్యోగులు, విద్యార్ధుల కడుపు కొట్టాడని ఆయన ధ్వజమెత్తారు. కాంగ్రెస్ వెయ్యి రోజుల చీటింగ్ పై యువత, విద్యార్థులు శాంతియుతంగా రోడ్లపైకొచ్చి సర్కార్ తో ఫైటింగ్ దిగడాన్ని త పార్టీ స్వాగతిస్తోందన్నారు.

కాంగ్రెస్ కొట్టిన దొంగ దెబ్బకు విద్యార్థులు, నిరుద్యోగులు విలవిలలాడుతున్నారని,

జాబ్ కేలండర్ ఒక జాబ్ లెస్ కేలండర్ అని ఆయన మండిపడ్డారు.

తెలంగాణ ఖజానా సొమ్ము మిస్ వరల్డ్ బ్యూటీల కోసమే తప్ప

తెలంగాణ అమ్మాయిల స్కూటీల కోసం కాదన్నది సీఎం రేవంత్ రెడ్డిలో పాతుకుపోయిన నిశ్చితాభిప్రాయమని ఆయన ఎద్దేవా చేశారు.

బకాయిల ఊబిలో కూరుకుపోయిన ఫీజు రీయింబర్స్ మెంట్ మరో ఎగవేత ఎక్స్పరిమెంట్ గా జీవన్ రెడ్డి అభివర్ణించారు.

రాష్ట్రంలో దాదాపు రూ. 10,000 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు

ఇందులో ఇంజినీరింగ్ విద్యార్థులకే రూ. 5,000 కోట్లకు పైగా రావాల్సి ఉంది .ఈ పథకాన్ని రద్దు చేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోంది.

పచ్చ కాంగ్రెస్ కుట్రకు అచ్చ కాంగ్రెస్ నేత వైఎస్ఆర్ ఆత్మ క్షోభిస్తోందని ఆయన పేర్కొన్నారు.

ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను దగా చేసిందన్నారు.

సరైన జాబ్ క్యాలెండర్ లేకుండా నిరుద్యోగులను నట్టేట ముంచారన్నారు.హక్కుల సాధనకోసం శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్న విద్యార్థులపై ప్రభుత్వ ప్రోత్సాహంతో పోలీసులు లాఠీఛార్జీలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లను ఉద్దేశించి “క్రిమినల్ వేస్ట్” అని చేసిన వ్యాఖ్యలు ఆయన కండ కావరానికి నిదర్శనమని జీవన్ రెడ్డి మండిపడ్డారు.

యువతకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైన కాంగ్రెస్ సర్కార్ కు పోయేకాలం దాపురించిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

యువత పతనాన్ని సర్కారు పెద్దలే అసలైన క్రిమినల్ వేస్ట్ అని ఆయన అన్నారు.

విద్యార్థులకు ఇస్తామన్న

రూ. 5 లక్షల విద్యా భరోసా కార్డులు ఏమయ్యాయని ఆయన నిలదీశారు.

నిరుద్యోగుల సమస్యలను పరిష్కరిస్తున్నామని, గత ప్రభుత్వాల కంటే మెరుగ్గా ఉద్యోగ నియామకాలు చేపడుతున్నామని కాంగ్రెస్ నాయకులు కోసిన కోతలేమయ్యాయని ఆయన ప్రశ్నించారు.

కాంగ్రెస్‌ పాలనలో ఉద్యోగాల కల్పన పెద్ద అభూత కల్పనగా మారిపోయిందని ఆయన ఎద్దేవా చేశారు.

సీఎం రేవంత్ రెడ్డి ఆరువేలిచ్చి.. 60 వేల ఉద్యోగాలిచ్చినట్టు పోజులు కొడుతుండని ఆయన అన్నారు.

అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో మొత్తం 20 రకాల నియామకాలకు సంబంధించిన షెడ్యూల్‌తో కూడిన జాబ్‌ క్యాలెండర్‌ను అసెంబ్లీ వేదికగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారని జీవన్ రెడ్డి గుర్తు చేశారు.

కానీ ఇప్పటి వరకూ ఏ ఒక్క నోటిఫికేషన్‌ కూడా విడుదల కాలేదన్నారు.

మరోవైపు, 2025-26 ఆర్థిక సంవత్సరం వచ్చింది కానీ, కొత్తగా ప్రకటించాల్సిన జాబ్‌ క్యాలెండర్‌ మాత్రం రాలేదన్నారు.

జాబ్‌ క్యాలెండర్‌ పత్తాలేకుండా పోయిందన్నారు.

ఉద్యోగాలు భర్తీచేసే టీజీపీఎస్సీ కూడా ‘ఇండెంట్లు ఇవ్వండి అని అడిగినా ప్రభు త్వం నుంచి స్పందన లేదన్నారు.దీంతో ప్రస్తుతం భర్తీ చేయాల్సిన పోస్టులేవీ టీజీపీఎస్సీ చేతిలో లేవన్నారు. అసెంబ్లీలో ప్రకటించిన 2024-25 జాబ్‌ క్యాలెండర్‌ ఇండెంట్లు టీజీపీఎస్సీకి అందలేదు.

జాబ్ కేలండర్ నెలవారీ పలు, గ్యాస్, ఇతర ఇంటి లెక్కలు రాసుకునే జాబ్ లెస్ కేలండర్ గా గోడకు వేలాడుతోందని ఆయన ఎద్దేవా చేశారు.

అసలు ఉద్యోగాలిచ్చిన ఘనత కేసీఆర్‌ ది, క్రెడిట్‌ చోరీ కాంగ్రెస్‌దని ఆయన చెప్పారు. 16 నెలల్లో 57 వేలకుపైగా ఉద్యోగాలను భర్తీచేసినట్టు ప్రభుత్వం చెప్తున్నదని ఆయన పేర్కొంటూ వీటిలో కాంగ్రెస్‌ సర్కారు కొత్తగా భర్తీచేసింది ఆరువేల ఉద్యోగాలేనని ఆయన స్పష్టం చేశారు.గ్రూప్‌-1, డీఎస్సీలు కూడా కేసీఆర్‌ హయాంలో విడుదలైనవేనన్నారు.

కాంగ్రెస్‌ భర్తీ చేసినట్టు చెప్పుకుంటున్న ఉద్యోగాలన్నీ గతంలో కేసీఆర్‌ హయాంలో 2022, 2023లో నోటిఫికేషన్లు ఇచ్చినవేనన్నారు.

కేసీఆర్‌ నోటిఫికేషన్లు ఇచ్చిన ఉద్యోగాలకు నియామకపత్రాలు అందజేసి తామే ఉద్యోగాలిచ్చినట్టు ప్రభుత్వం బిల్డప్‌ ఇస్తున్నదని జీవన్ రెడ్డి విమర్శించారు.

జేఎల్‌ నోటిఫికేషన్‌ దాదాపు 13 ఏండ్ల తర్వాత కేసీఆర్‌ సర్కారే విడుదల చేసిందన్నారు.

ఇటీవల ఫలితాలు ప్రకటించిన గ్రూప్‌-4 సహా పలు పరీక్షలను బీఆర్‌ఎస్‌ సర్కారు హయాంలోనే నిర్వహించారని ఆయన స్పష్టం చేశారు. గ్రూప్‌-2, గ్రూప్‌-3 నోటిఫికేషన్లను కూడా బీఆర్‌ఎస్‌ సర్కారే విడుదల చేసిందన్నారు.

వాటిలో కొన్ని కోర్టు కేసుల కారణంగా నిలిచిపోగా, ఇటీవల న్యాయస్థానాల్లో చిక్కుముడులు వీడటంతో ఇప్పుడు నియామకపత్రాలిచ్చి తామే ఇచ్చినట్టు కాంగ్రెస్‌ సర్కారు చెప్పుకుంటు న్నదని ఆయన అన్నారు.

రేవంత్ రెడ్డి సర్కారు యువతను నిలువునా ముంచిందని, అసెంబ్లీ ఎన్నికల ముందు నిరుద్యోగ యువత ఓట్ల కోసం కాంగ్రెస్‌ పార్టీ యూత్‌ డిక్లరేషన్‌ను ప్రకటించి, అధికారంలోకి రాగానే అటకెక్కించిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగులకు నెలకు రూ.4వేల చొప్పున ఇస్తామన్న నిరుద్యోగ భృతి హామీ మృతి చెందేలా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందన్నారు.

విద్యార్థులకు రూ.5 లక్షల విద్యాభరోసా కార్డు, రూ.10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు తదితర హామీలేవీ అమలు కాలేదన్నారు.

తొలి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాల భర్తీ హామీ అటకెక్కింద న్నారు. ఆఖరుకు ఏడాదిలో ఒక్కసారి మాత్రమే ఫీజు వసూలు చేస్తామన్న హామీని కూడా నిలబెట్టుకోలేదన్నారు.

ఖాళీలున్నా నియామకాలు గుండుసున్నా.

నిరుద్యోగరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ఏడు జోన్లల్లో ఎంప్లాయిమెంట్‌ ఎక్సేంజీల ఏర్పాటు ఏమయిందో ఆ కాంగ్రెస్ ప్రభువులకే తెలియాలి.

జిల్లాల్లో స్కిల్‌ సెంటర్ల ఏర్పాటు కాగితాలకే పరిమితమైంది.

విద్య, ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు యూత్‌ కమిషన్‌ ఏర్పాటు చేస్తామన్న మాట నిలుపుకోలేదు.

ఉచిత వైఫై కనెక్షన్‌ అని ఊదరగొట్టి అన్నీ మర్చిపోయారు.

యూనివర్సిటీల్లోని రీసెర్చ్‌ స్కాలర్‌కు నెలకు రూ.10 వేల చొప్పున ఫెలోషిప్‌

గెస్ట్‌ ఫ్యాకల్టీ, పార్ట్‌టైమ్‌ లెక్చరర్ల గౌరవ వేతనాన్ని నెలకు రూ.50 వేలకు పెంచుతామని మోసం చేసిండ్రు అని జీవన్ రెడ్డి నిప్పులు చెరిగారు.

 *పోలీసుల ఓవరాక్షన్* 

-నిరుద్యోగులు, విద్యార్థులపై ఖాకీల జులుం

బీఆర్ఎస్ ఆందోళనలో పాల్గొనకుండా గేట్లకు తాళాలు

నందిపేట్ లో తలపెట్టిన బీ ఆర్ఎస్ ఆందోళన సందర్భంగా పోలీసులు ఓవరాక్షన్ చేశారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్ వెంటనే విడుదల చేయాలని,

జాబ్ క్యాలెండర్ వెంటనే ప్రకటించాలి,

యూత్ డిక్లరేషన్ వెంటనే అమలు చేయాలన్న డిమాండ్లతో చేపట్టిన ర్యాలీకి విద్యార్థులు రాకుండా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు.

నిరుద్యోగులు, విద్యార్థులపై ఖాకీలు జులుం ప్రదర్శించారు.

బీఆర్ఎస్ ఆందోళనలో పాల్గొనకుండా

కాలేజ్ యాజమాన్యం విద్యార్థులను బెదిరించి, పోలీసులతో కాలేజ్ గేటుకు తాళం వేయించింది. విషయం తెలుసుకున్న ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి వెంటనే కాలేజ్‌కు చేరుకున్నారు.

విద్యార్థులను అడ్డుకోవడంపై పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగిన జీవన్ రెడ్డి వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు .గేటును నెట్టివేసి లోపలికి వెళ్లి విద్యార్థులను బయటకు తీసుకొచ్చారు.

అనంతరం అక్కడి నుంచి పెద్ద ఎత్తున విద్యార్థులతో కలిసి ర్యాలీగా నందిపేట్ కు బయలుదేరారు.

విద్యార్థుల గొంతును నొక్కితే చూస్తూ ఊరుకునేది లేదు!

యువత హక్కుల కోసం.. విద్యార్థుల భవిష్యత్తు కోసం.. పోరాటం ఆగదని ఈ సందర్భంగా జీవన్ రెడ్డి హెచ్చరించారు.

ఈ కార్య క్రమంలో మాజీ జడ్పి ఛైర్మన్ విఠల్ రావు,సీనియర్ నాయకులు రాజారాం యాదవ్,బిఆర్ఎస్ యువజన విభాగం నాయకులు అభిలాష్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు,విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

24 గంటల్లో బాలుడి అపహరణ కేసును ఛేదించిన నిజామాబాద్ పోలీసులు…

0
24 గంటల్లో బాలుడి అపహరణ కేసును ఛేదించిన నిజామాబాద్ పోలీసులు సంగారెడ్డిలో బాలుడిని సురక్షితంగా రక్షించి తల్లిదండ్రులకు అప్పగింత... నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో అపహరణకు గురైన రెండున్నరేళ్ల బాలుడి ఆచూకీని నిజామాబాద్ పోలీసులు కేవలం...

ఇందల్వాయి గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటు…

0
ఇందల్వాయి గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటు మన ఊరు మన బాధ్యతను మన ఊరు మన భద్రత... త్రిశూల్ న్యూస్ ఇందల్వాయి మండల్ రిపోర్టర్ జితేందర్ నిజామాబాద్ జిల్లా:ఇందల్వాయి : గ్రామంలో పాలకవర్గము ఆధ్వర్యంలో గ్రామములో సిసి కెమెరా...

దుబాయ్‌లో జరిగే GTF జీటీఎఫ్ బతుకమ్మ సంబరాలకు ముఖ్య అతిథిగా కేటీఆర్‌కు ఆహ్వానం…

0
దుబాయ్‌లో జరిగే GTF జీటీఎఫ్ బతుకమ్మ సంబరాలకు ముఖ్య అతిథిగా కేటీఆర్‌కు ఆహ్వానం... దుబాయ్‌లో గల్ఫ్ తెలంగాణ ఫోరం (GTF) ఆధ్వర్యంలో అక్టోబర్ 11, ఆదివారం రోజున అంగరంగ వైభవంగా నిర్వహించనున్న బతుకమ్మ సంబరాలకు...

కొడంగల్ వేదికగా పాంచజన్య శంఖారావం: కల్వకుంట్ల కవిత…

0
కొడంగల్ వేదికగా పాంచజన్య శంఖారావం: కల్వకుంట్ల కవిత... కొడంగల్ పై కవిత ఫోకస్ ఈనెల 23న కోస్గిలో పాంచజన్య సంకల్ప సభ పోస్టర్ రిలీజ్ చేసిన తెలంగాణ రక్షణ సేన చీఫ్ హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి...

మిస్టర్ డీజీపీ.. నన్ను అసభ్యంగా కామెంట్ చేసిన పోలీస్‌ను అరెస్ట్ చేయాలి: కవిత…

0
మిస్టర్ డీజీపీ.. నన్ను అసభ్యంగా కామెంట్ చేసిన పోలీస్‌ను అరెస్ట్ చేయాలి: కవిత... తనపై సోషల్ మీడియాలో అసభ్యకర వ్యాఖ్యలు చేసిన కానిస్టేబుల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల...

24 గంటల్లో బాలుడి అపహరణ కేసును ఛేదించిన నిజామాబాద్ పోలీసులు…

0
24 గంటల్లో బాలుడి అపహరణ కేసును ఛేదించిన నిజామాబాద్ పోలీసులు సంగారెడ్డిలో బాలుడిని సురక్షితంగా రక్షించి తల్లిదండ్రులకు అప్పగింత... నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో అపహరణకు గురైన రెండున్నరేళ్ల బాలుడి ఆచూకీని నిజామాబాద్ పోలీసులు కేవలం...

ఇందల్వాయి గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటు…

0
ఇందల్వాయి గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటు మన ఊరు మన బాధ్యతను మన ఊరు మన భద్రత... త్రిశూల్ న్యూస్ ఇందల్వాయి మండల్ రిపోర్టర్ జితేందర్ నిజామాబాద్ జిల్లా:ఇందల్వాయి : గ్రామంలో పాలకవర్గము ఆధ్వర్యంలో గ్రామములో సిసి కెమెరా...

దుబాయ్‌లో జరిగే GTF జీటీఎఫ్ బతుకమ్మ సంబరాలకు ముఖ్య అతిథిగా కేటీఆర్‌కు ఆహ్వానం…

0
దుబాయ్‌లో జరిగే GTF జీటీఎఫ్ బతుకమ్మ సంబరాలకు ముఖ్య అతిథిగా కేటీఆర్‌కు ఆహ్వానం... దుబాయ్‌లో గల్ఫ్ తెలంగాణ ఫోరం (GTF) ఆధ్వర్యంలో అక్టోబర్ 11, ఆదివారం రోజున అంగరంగ వైభవంగా నిర్వహించనున్న బతుకమ్మ సంబరాలకు...

కొడంగల్ వేదికగా పాంచజన్య శంఖారావం: కల్వకుంట్ల కవిత…

0
కొడంగల్ వేదికగా పాంచజన్య శంఖారావం: కల్వకుంట్ల కవిత... కొడంగల్ పై కవిత ఫోకస్ ఈనెల 23న కోస్గిలో పాంచజన్య సంకల్ప సభ పోస్టర్ రిలీజ్ చేసిన తెలంగాణ రక్షణ సేన చీఫ్ హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి...

మిస్టర్ డీజీపీ.. నన్ను అసభ్యంగా కామెంట్ చేసిన పోలీస్‌ను అరెస్ట్ చేయాలి: కవిత…

0
మిస్టర్ డీజీపీ.. నన్ను అసభ్యంగా కామెంట్ చేసిన పోలీస్‌ను అరెస్ట్ చేయాలి: కవిత... తనపై సోషల్ మీడియాలో అసభ్యకర వ్యాఖ్యలు చేసిన కానిస్టేబుల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల...
Translate »
error: Content is protected !!