పోగొట్టుకున్న సొత్తును బాధితురాలికి అందజేసిన కమ్మర్పల్లి పోలీసులు…
త్రిశూల్ న్యూస్ కమ్మర్పల్లి మండల్ రిపోర్టర్ గుర్రం నరేష్
సారంగాపూర్‌కు చెందిన శ్రీమతి జులేఖా బేగం గురువారం నిజామాబాద్ నుండి చౌట్పల్లికి బంధువుల వివాహానికి ఆటోలో వస్తుండగా తన పర్స్ పోగొట్టుకున్నారు. అందులో ఒక తులం బంగారు కమ్మలు, రూ. 1,000 నగదు మరియు సెల్ ఫోన్ ఉన్నాయి.
బాధితురాలి ఫిర్యాదుపై వెంటనే స్పందించిన కమ్మర్పల్లి ఎస్ఐ సిహెచ్. సతీష్, ఏఎస్ఐ ఎం. వెంకట్ కుమార్, కానిస్టేబుల్ కె. దినేష్‌లను రంగంలోకి దింపారు. సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా పర్సును ట్రేస్ చేసి స్వాధీనం చేసుకుని, పోలీస్ స్టేషన్లో బాధితురాలికి సురక్షితంగా అందజేశారు.
పోగొట్టుకున్న పర్సును వెతికి పట్టుకుని, బాధితురాలికి అందజేయడంలో సమర్థవంతంగా వ్యవహరించిన ఎస్ఐ సిహెచ్. సతీష్, ఏఎస్ఐ ఎం. వెంకట్ కుమార్, కానిస్టేబుల్ కె. దినేష్‌లను ఉన్నతాధికారులు అభినందించారు. అత్యవసర సమయాల్లో ప్రజలు ‘డయల్ 112’ సేవలను ఉపయోగించుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా జులేఖా బేగం కుటుంబ సభ్యులు కమ్మర్పల్లి పోలీసులకు తమ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

























