కలిగోట్‌లో సంఘ భవనాల నిర్మాణానికి రూ.10 లక్షలు…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్
నిజామాబాద్: గ్రామాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వంప్రాధాన్యత ఇస్తోందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి అన్నారు.
శుక్రవారం జక్రాన్‌పల్లి మండలం కలిగోట్ గ్రామంలో రెడ్డి సంఘ భవన నిర్మాణానికి రూ.5 లక్షలు, ఎస్సీ (మాదిగ) సంఘ భవన నిర్మాణానికి రూ.5 లక్షలు చొప్పున మొత్తం రూ.10 లక్షల నిధులు మంజూరయ్యాయి. ఈ నిధులకు సంబంధించిన ప్రొసీడింగ్స్‌ను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సంఘం సభ్యులకు ఎమ్మెల్యే అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తోందన్నారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నామని తెలిపారు. గ్రామస్తులంతా ఐక్యంగా ఉంటూ గ్రామాభివృద్ధిలో భాగస్వాములు కావాలని సూచించారు.
సంఘ భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు చేసినందుకు సంఘాల సభ్యులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ రాజు నాయక్, రెడ్డి సంఘం పెద్ద వాకిటి భోజన్న, ఎస్సీ సంఘం నాయకుడు గంగాధర్, అల్లూరి శ్రీనివాస్, లింబాద్రి, సాయి రెడ్డి, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

























