ధర్పల్లిలో డీజేలకు అనుమతి లేదు: ఎస్ఐ సందీప్…
త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
ధర్పల్లి: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి పోలీస్‌స్టేషన్‌లో వినాయక నిమజ్జన కార్యక్రమాలపై మండపాల నిర్వాహకులతో పోలీసులు శుక్రవారం సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్సై సందీప్ మాట్లాడుతూ.. వినాయక నిమజ్జనాన్ని శాంతియుతంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా నిర్వహించాలని సూచించారు. నిమజ్జన ఊరేగింపులో డీజేలకు అనుమతి లేదని, కేవలం రెండు సౌండ్ బాక్సులు మాత్రమే వినియోగించాలని స్పష్టం చేశారు.
పోలీసుల సూచనలను ఉల్లంఘించి డీజేలు వినియోగిస్తే నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు. నిమజ్జన సమయంలో నిర్వాహకులు పోలీసులకు సహకరించాలని కోరారు.
ఈ సమావేశంలో వినాయక మండపాల నిర్వాహకులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

























