డిచ్పల్లిలో ప్రజావాణికి 6 ఫిర్యాదులు…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్
నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎంపీడీఓ సూపరింటెండెంట్ శ్రీధర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వివిధ సమస్యలపై మొత్తం 6 ఫిర్యాదులు అందినట్లు అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా ఎంపీడీఓ సూపరింటెండెంట్ శ్రీధర్ మాట్లాడుతూ.. ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజలు తమ సమస్యలను ప్రజావాణి ద్వారా అధికారుల దృష్టికి తీసుకువస్తే, వాటిని పరిశీలించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
ప్రజలు ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సతీష్ రెడ్డి, మండల విద్యాశాఖ అధికారి నరేష్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

























