ఎస్డీఆర్ఎఫ్ నిధులతో రోడ్ల మరమ్మతులు.
రూ.40 లక్షల ఎస్డీఆర్ఎఫ్ నిధులతో పనులు ప్రారంభించిన మున్సిపల్ చైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం
కామారెడ్డి పట్టణంలో వరదల కారణంగా దెబ్బతిన్న రహదారుల మరమ్మతులకు ఎస్డీఆర్ఎఫ్ నిధులు మంజూరయ్యాయి.
రాష్ట్ర ప్రభుత్వం ఎస్డీఆర్ఎఫ్ నిధుల కింద మున్సిపాలిటీకి రూ.40 లక్షలు మంజూరు చేసింది.
ఈ నిధులతో చేపట్టే అభివృద్ధి, రహదారి మరమ్మతు పనులను మున్సిపల్ చైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ ప్రారంభించారు.
వరదలతో దెబ్బతిన్న రహదారుల మరమ్మతులకు రూ.32.12 లక్షలు మంజూరైనట్లు తెలిపారు.
రహదారి మరమ్మతులకు రూ.7.88 లక్షలు కేటాయించినట్లు పేర్కొన్నారు.
గతంలో తుఫాను, వరదల కారణంగా రహదారులు దెబ్బతినడంతో ఈ నిధులు విడుదలయ్యాయని చెప్పారు.
ప్రజల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా రహదారులను త్వరితగతిన బాగు చేస్తామని చైర్పర్సన్ తెలిపారు.
పట్టణంలో దెబ్బతిన్న ఇతర రహదారులపై కూడా అవసరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
నిధులు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి, జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్లకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ కాసర్ల గోదావరి, మున్సిపల్ కమిషనర్ పర్వతాలు, కౌన్సిలర్లు సుల్తానా, యూసుఫ్, సత్యం, డీఈ అనంతరావు, ఏఈ వేణు ప్రసాద్, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

























